AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్.. టీమిండియా తోపును వెంటాడుతున్న ఆ ‘శాపం’..?

IPL Unluckiest Player: మైదానంలో క్లాస్ షాట్లతో అలరించే ఈ టీమిండియా ప్లేయర్ కేవలం ఒక ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గా కూడా తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఐపీఎల్ ట్రోఫీ విషయంలో మాత్రం అతనికి బ్యాడ్ లక్ వెంటాడుతోంది. మరి భవిష్యత్తు సీజన్లలోనైనా ఈ ఐపీఎల్ శాపాన్ని బద్దలు కొట్టి ట్రోఫీని ముద్దాడతాడో లేదో చూడాలి.

ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్.. టీమిండియా తోపును వెంటాడుతున్న ఆ 'శాపం'..?
Ipl Unluckiest Player
Venkata Chari
|

Updated on: May 30, 2026 | 4:43 PM

Share

IPL Unluckiest Player: క్రికెట్ ప్రపంచంలో ఎంతటి ప్రతిభ ఉన్నా, కొన్నిసార్లు అదృష్టం కలిసిరాకపోతే చరిత్రలో విజేతగా నిలవలేరనేది అక్షరాలా నిజం. టీమిండియా క్లాస్ బ్యాటర్ ఐపీఎల్ ప్రయాణాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. మైదానంలో పరుగుల వరద పారించినా, ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడే భాగ్యం మాత్రం ఈ స్టార్ ఆటగాడికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.

ఈ టీమిండియా ప్లేయర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రస్థానం 2013లో ప్రారంభమైంది. దాదాపు 13 ఏళ్లుగా ఈ పొట్టి ఫార్మాట్ టోర్నీలో రాహుల్ విభిన్న జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నాడు. వ్యక్తిగతంగా ఎన్నో అద్భుతమైన రికార్డులు సృష్టించినప్పటికీ, జట్టుగా ఐపీఎల్ కప్పును గెలుచుకునే అదృష్టం అతనికి దక్కలేదు. ఐపీఎల్ 2026 సీజన్ లోనైనా తన తలరాత మారుతుందని ఆశించిన రాహుల్ కు ఈసారి కూడా తీవ్ర నిరాశే ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బరిలోకి దిగిన అతను, ఈ సీజన్ లోనూ ఖాళీ చేతులతోనే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరో తెలుసా? టీమిండియా క్లాస్ ప్లేయర్ కేఎల్ రాహుల్.

ప్లే ఆఫ్స్ చేరకుండానే ఢిల్లీ అవుట్.. నిరాశలో అభిమానులు..

ఈ ఏడాది టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 7 విజయాలు, 7 ఓటములతో సరిపెట్టుకుంది. కీలకమైన సమయాల్లో జట్టు సమిష్టిగా రాణించలేకపోవడం, నెట్ రన్ రేట్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ అధికారికంగా తప్పుకుంది. దీంతో రాహుల్ ఖాతాలో మరో ఐపీఎల్ పరాజయం చేరింది. కోట్లాది మంది అభిమానులు రాహుల్ చేతిలో ట్రోఫీ చూడాలని ఆశపడ్డా, విధి ఆ అవకాశం ఇవ్వలేదు.

జట్లు మారినా అదృష్టం రాలేదు బాస్..!

రాహుల్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఎన్నో అగ్రశ్రేణి జట్లకు ఆడాడు. ఆయా జట్ల వివరాలు ఇలా ఉన్నాయి:

2013, 2016లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

2014లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)

2018 – 2021లో పంజాబ్ కింగ్స్ (PBKS) – కెప్టెన్‌గా

2022 – 2024లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) – కెప్టెన్‌గా

2025 – 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)

ఇందులో చిత్రమేమిటంటే, రాహుల్ ఏ జట్టులో అయితే ఉంటాడో ఆ జట్టు కాకుండా, అతను వదిలేసిన జట్లు తర్వాతి కాలంలో కప్పులు గెలిచాయి. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రోఫీ సాధించినప్పుడు రాహుల్ ఆర్సీబీలో ఉన్నాడు. ఇక ఆర్సీబీ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2025లో తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలవగా, సరిగ్గా అదే సీజన్ లో రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ గూటికి చేరాడు. మరోవైపు అతను కెప్టెన్సీ చేసిన లక్నో, పంజాబ్ జట్లతో పాటు ప్రస్తుత ఢిల్లీ జట్టుకు కూడా ఐపీఎల్ కప్పు ఇప్పటికీ ఒక కలగానే మిగిలిపోయింది.

మైదానంలో క్లాస్ షాట్లతో అలరించే కేఎల్ రాహుల్ కేవలం ఒక ఆటగాడిగానే కాకుండా కెప్టెన్‌గా కూడా తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ ఐపీఎల్ ట్రోఫీ విషయంలో మాత్రం అతనికి బ్యాడ్ లక్ వెంటాడుతోంది. మరి భవిష్యత్తు సీజన్లలోనైనా ఈ ఐపీఎల్ శాపాన్ని బద్దలు కొట్టి, రాహుల్ ట్రోఫీని ముద్దాడతాడో లేదో చూడాలి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us