AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AC Water Leaking: ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్‌..!

AC Water Leaking: ఏసీలోని ఎయిర్ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే కూడా ఈ సమస్య తలెత్తుతుందంటున్నారు. దీని వల్ల గాలి ప్రసరణ సరిగ్గా జరగదు. గాలి సరిగ్గా ఆడనప్పుడు ఏసీ కాయిల్స్‌పై మంచు గడ్డకట్టుకుపోతుంది. ఎప్పుడు ఏసీ నుంచి..

AC Water Leaking: ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్‌..!
Ac Water Leaking
Subhash Goud
|

Updated on: May 31, 2026 | 2:20 PM

Share

AC Water Leaking: వేసవి కాలంలో ఏసీలకు పని ఎక్కువైపోతుంది. ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎండల తీవ్రత వల్ల ఏసీ వాడకం ఎక్కువగా ఉంటుంది. అయితే ఒక్కోసారి ఏసీ నుంచి నీళ్లు కారుతుంటాయి. దీని వల్ల గోడలు పాడైపోవడమే కాకుండా ఇల్లంతా నీరు చేరడం వంటి సమస్య తలెత్తుతుంది. సాధారణంగా ఏసీ గదిలోని తేమను లాగేసుకుని, ఆ నీటిని పైపుల ద్వారా బయటకు పంపుతుంది. ఏసీలో చిన్నపాటి లోపం తలెత్తినా నీరు కారుతుంటుంది. అలాంటి సమయంలో ఎలా సరి చేసుకోవలో తెలుసుకుందాం..

  1. పైపుల్లో పేరుకుపోయే వ్యర్థాలు: ఏసీ నుంచి నీరు లీక్ అవ్వడానికి మొదటి కారణం డ్రైన్ పైపులో మురికి పేరుకుపోవడమేనని ఏసీ టెక్నీషియన్స్‌చెబుతున్నారు. ఏసీ రన్ అవుతున్నప్పుడు వచ్చే తేమ కారణంగా డ్రైన్ పైపులో నాచు, బూజు లేదా దుమ్ము చేరి బ్లాక్ అవుతుంది. దీనివల్ల నీరు బయటకు వెళ్లే దారి లేక వెనక్కి తన్నుకుని ఇంట్లోకి వస్తుంది. దీనిని క్లీన్ చేయడానికి ఏసీని పూర్తిగా ఆఫ్‌ చేసిన తర్వాతే పైపు చివరను వాక్యూమ్ క్లీనర్ సహాయంతో శుభ్రం చేయొచ్చు. అలాగే ప్రతి 3 నెలలకోసారి ఇండోర్ యూనిట్ వద్ద ఉండే డ్రైన్ హోల్‌లో ఒక కప్పు తెల్లని వెనిగర్‌ పోస్తే నాచు పట్టకుండా ఉంటుందంటున్నారు.
  2. ఎయిర్ ఫిల్టర్లు మురికిగా మారడం: ఏసీలోని ఎయిర్ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే కూడా ఈ సమస్య తలెత్తుతుందంటున్నారు. దీని వల్ల గాలి ప్రసరణ సరిగ్గా జరగదు. గాలి సరిగ్గా ఆడనప్పుడు ఏసీ కాయిల్స్‌పై మంచు గడ్డకట్టుకుపోతుంది. ఎప్పుడు ఏసీ నుంచి నీళ్లు రావడం మొదలవుతుంది. ఫిల్టర్లను కనీసం నెలకోసారి చెక్ చేసుకుని శుభ్రం చేసుకోవడం మంచిది. ఒకవేళ మంచు గడ్డకట్టినట్లు గమనిస్తే.. ఏసీని కాసేపు ఆపి కేవలం ఫ్యాన్ మోడ్‌లో పెడితే మంచు త్వరగా కరిగిపోతుంది.
  3. డ్రైన్ ప్యాన్ పాడైపోవడం: పాత ఏసీలలో కాయిల్స్ కింద ఉండే డ్రైన్ ప్యాన్ కాలక్రమేణా తుప్పు పట్టడం లేదా పగిలిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ లేదా ఇనుప ట్రేలు ఎక్కువ కాలం వాడటం వల్ల వాటికి రంధ్రాలు పడతాయి. టార్చిలైట్ వేసి చూస్తే ఈ ప్యాన్ ఎక్కడైనా విరిగిందో లేదో తెలుస్తుంది. చిన్న చిన్న పగుళ్లు ఉంటే సీలెంట్ వేసి తాత్కాలికంగా సరిచేయవచ్చు. కానీ, ఎక్కువ రంధ్రాలు పడితే మాత్రం కొత్త ప్యాన్‌ను మార్చడం తప్పనిసరి.
  4. ఇన్‌స్టాలేషన్ సరిగ్గా చేయకపోడం: ఇక్కడ మరో కారణం ఏంటంటే ఇన్‌స్టాలేషన్‌ సరిగ్గా చేయకపోవడం.కొత్తగా కొన్న స్ప్లిట్ ఏసీల నుంచి నీరు కారుతుంటే దానికి ఇదే ప్రధాన కారణం కావచ్చు. ఏసీని గోడకు అమర్చేటప్పుడు అది కొద్దిగా డ్రైన్ పైపు వైపు వాలి ఉండాలి. అలా కాకుండా సమానంగా లేదా వెనుక వైపునకు వాలి ఉంటే.. గురుత్వాకర్షణ శక్తి లోపించి నీరు బయటకు వెళ్లకుండా ఇండోర్ యూనిట్ నుంచే కిందకు కారుతుంది.
  5. ఇవి కూడా చదవండి

లీకేజీలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?:

  • ఏసీ నుంచి నీళ్లు వస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఫిల్టర్లను నెలన్నర రోజులకు ఒకసారి క్లీన్ చేయడం తప్పనిసరి అని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.
  • వేసవి కాలం ప్రారంభానికి ముందే ప్రొఫెషనల్ టెక్నీషియన్ చేత ఏసీ సర్వీసింగ్ చేయించుకోవాలి.
  • గ్యాస్ ప్రెజర్ చెక్ చేయించుకోవడం ఉత్తమం.
  • బయట ఉండే డ్రైన్ పైపు చివర మట్టిలో మునిగిపోకుండా, చెత్తాచెదారం అడ్డం పడకుండా చూసుకోవాలి.
  • ఇంట్లో తేమ శాతం ఎక్కువగా ఉంటే డీహ్యూమిడిఫైయర్ వాడటం ద్వారా కూడా ఏసీపై భారం తగ్గుతుంది.
  • ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఏసీ ఎల్లప్పుడూ లీకేజీలు లేకుండా చక్కగా పనిచేస్తుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.
వేసవిలో నల్లబడిన చర్మానికి చెక్.. ఈ స్ట్రాబెర్రీ-తేనె ఫేస్ ప్యాక్
వేసవిలో నల్లబడిన చర్మానికి చెక్.. ఈ స్ట్రాబెర్రీ-తేనె ఫేస్ ప్యాక్
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 విజేతపై కాసుల వర్షం..!
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 విజేతపై కాసుల వర్షం..!
వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయాలా.. ఫోన్‌లోని ఈ సీక్రెట్ ట్రిక్స్..
వాట్సాప్ కాల్స్ రికార్డ్ చేయాలా.. ఫోన్‌లోని ఈ సీక్రెట్ ట్రిక్స్..
రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం.. పండుగ జరుపుకోవచ్చా? లేదా?
రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం.. పండుగ జరుపుకోవచ్చా? లేదా?
Vastu Tips: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? నెగెటివ్ ఎనర్జీని
Vastu Tips: ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? నెగెటివ్ ఎనర్జీని
నా కోసం ఆ డైరెక్టర్ ఇంటికొచ్చేసాడు..
నా కోసం ఆ డైరెక్టర్ ఇంటికొచ్చేసాడు..