మరీ ఇలా ఉన్నారేంట్రా.. అర్ధరాత్రి దారుణం.. ఇద్దరు యువతులను వెంబడించిన వ్యక్తి..
ఐటీ రాజధాని బెంగళూరులో మరోదారుణం వెలుగుచూసింది. వీధిలో నడిచి వెళ్తున్న ఇద్దరు యువతులను వెంబడించిన గుర్తుతెలియని వ్యక్తి ఓ యువతిని అసభ్యంగా తాకాడు. ఆ అమ్మాయులు తేరుకుని ప్రతిఘటించేలోపే అక్కడి నుండి పరారయ్యాడు. అక్కడే ఏర్పాటు చేసిన సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదంటున్న పోలీసులు సీసీఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకుంటామంటామని ప్రకటించారు.

ఐటీ రాజధాని బెంగళూరులో మరోదారుణం వెలుగుచూసింది. వీధిలో నడిచి వెళ్తున్న ఇద్దరు యువతులను వెంబడించిన గుర్తుతెలియని వ్యక్తి ఓ యువతిని అసభ్యంగా తాకాడు. ఆ అమ్మాయులు తేరుకుని ప్రతిఘటించేలోపే అక్కడి నుండి పరారయ్యాడు. అక్కడే ఏర్పాటు చేసిన సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదంటున్న పోలీసులు సీసీఫుటేజ్ ఆధారంగా చర్యలు తీసుకుంటామంటామని ప్రకటించారు. మహిళపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన బెంగళూరులో ఏప్రిల్ 3 గురువారం అర్ధరాత్రి చోటోచేసుకుంది.
వివరాల ప్రకారం..
కర్ణాటక రాజధాని బెంగళూరులోని బిటిఎం లేఅవుట్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రదేశంలో ఏర్పాటు చేసిన CCTV కెమెరాలో రికార్డైన ఈ సంఘటన వీడియోలో.. ఇరుకైన సందులో నడుస్తున్న ఇద్దరు మహిళల వద్దకు ఒక వ్యక్తి వస్తున్నట్లు కనిపిస్తోంది. రోడ్డుకు ఒక వైపున అనేక ద్విచక్ర వాహనాలు ఆగి ఉండటంతో వీధి ఇరుకుగా.. నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి వెనుక నుండి ఇద్దరు మహిళల వద్దకు రాగానే.. అతను ఆ మహిళల్లో ఒకరిని పట్టుకుని పారిపోతున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత ఇద్దరు మహిళలు వెళ్ళిపోతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. బాధితురాలు ఆ నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందుకు రాకపోతే.. ఈ విషయంలో తాము స్వయంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు.
A humble request to all women in #Bengaluru: Please avoid going out alone at night. This city is no longer safe for women. Miscreants seem to have lost all fear of @BlrCityPolice @CPBlr. The eve-teasing incident from late Thursday night in BTM is truly harrowing. pic.twitter.com/8z1hWVHIGm
— Citizens Movement, East Bengaluru (@east_bengaluru) April 7, 2025
ఈ ఘటన కర్ణాటకలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుందని.. మహిళలకు అభ్యర్థన.. దయచేసి రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లడం మానుకోండి. అంటూ పలువరు నెటిజన్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..