మనుషులా రక్షసులా..! ఇద్దరు బాలలను చెట్టుకు కట్టేసి.. ఎర్ర చీమలతో.. దారుణాతి దారుణంగా..
ఇద్దరు మైనర్ బాలలను చెట్టుకు కట్టేసి తీవ్రంగా హింసించిన ఘటన.. కర్నాటకలోని దావణగెరి కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. నల్లూరు సమీపంలోని అస్తపనహళ్లిలో ఈ సంఘటన జరిగింది. హకీపిక్కీ వర్గానికి చెందిన బాలలపై.. అదే వర్గానికి చెందిన యువకులు దాడి చేశారు.

ఇద్దరు మైనర్ బాలలను చెట్టుకు కట్టేసి తీవ్రంగా హింసించిన ఘటన.. కర్నాటకలోని దావణగెరి కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంతో ఘటనపై పోలీసులు దృష్టి సారించారు. నల్లూరు సమీపంలోని అస్తపనహళ్లిలో ఈ సంఘటన జరిగింది. హకీపిక్కీ వర్గానికి చెందిన బాలలపై.. అదే వర్గానికి చెందిన యువకులు దాడి చేశారు. వీరంతా మూలికలు అమ్ముతూ జీవనోపాధి పొందుతుంటారు. అయితే దొంగతనం చేశారన్న ఆరోపణలతో ఇద్దరు బాలలను కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆపై ఎర్ర చీమలను వారిపై వదిలారు. నొప్పి తాళలేక వాళ్లు కేకలు పెడుతుంటే.. అవి వింటూ నిందితులు డ్యాన్స్‌లు చేశారు. ఆనందంతో విర్రవీగుతూ వారిపై కర్కశంగా దాడి చేస్తూ.. పైశాచికానందం పొందారు. బాలలను తీవ్రంగా హింసించిన ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కూడా ఘటనను తీవ్రంగా ఖండించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
దావణగెరె జిల్లాలోని చన్నగిరి తాలూకాలో దోపిడీకి పాల్పడినట్లు అనుమానిస్తూ హక్కీ పిక్కీ వర్గానికి చెందిన ఇద్దరు మైనర్ బాలురను చెట్టుకు కట్టేసి దాడి చేసిన కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. తొమ్మిదవ నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు.
మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చన్నగిరి పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎం. రవీష్ తెలిపారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. బాధితులలో ఒకరి తాత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని తెలిపారు. అరెస్టు చేసిన వారందరినీ ఆదివారం జె.ఎం.ఎఫ్.సి కోర్టు ముందు హాజరుపరిచి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని రవీష్ అన్నారు.
మరిన్ని జాాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..