Viral: ఫస్ట్ నైట్ రోజున భార్యను దూరం పెట్టాడు.. ఆరా తీయగా.. బయటపడ్డ భర్త బండారం.!
ఆ మహిళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆమె ఎన్నో ఆశలతో తన కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. కానీ ఫస్ట్ నైట్ రోజునే అంతా తలక్రిందులైంది.
ఆ మహిళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆమె ఎన్నో ఆశలతో తన కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. అంతా బాగానే ఉంటుందని భావించింది. కానీ ఫస్ట్ నైట్ రోజునే అంతా తలక్రిందులైంది. ఆ రోజు నుంచి ఒక్క రోజు కూడా ఆమెతో భర్త గడపలేదు. కొద్దిరోజులకే భర్త బండారం బయటపడింది. ఇక చేసేదేమిలేక పోలీసులను ఆశ్రయించింది సదరు బాధితురాలు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. 2022లో బెంగళూరుకు చెందిన బాధిత మహిళకు ప్రమోద్ కుమార్ అనే వ్యక్తితో పెళ్లయింది. సదరు మహిళ పెళ్లిని.. ఆమె కుటుంబం అంగరంగ వైభవంగా జరిపింది. రూ. 30 లక్షల ఖర్చు చేసి పెళ్లి చేయడంతో పాటు భారీగా కట్న కానుకలు ఇచ్చారు. అంతా బాగానే ఉందని ఆ మహిళ అనుకునేలోపు.. మొత్తం తలక్రిందులైంది. ఫస్ట్ నైట్ రోజున భర్త దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఒక్క రోజు కూడా ఆమెతో భర్త గడపలేదు. ఎప్పుడూ మరో మహిళతో రీల్స్, వీడియోలు చేస్తూ ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తుండేవాడు. ఇక అతడి తమ్ముడికి(బాధిత మహిళ మరిది) సందు దొరికినప్పుడల్లా అశ్లీల వీడియోలు చూడటంతో పాటు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించడమే పని.
వారిని ప్రశ్నించడం మానేసి.. అత్తమామలు సదరు మహిళను అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించేవారు. ఆ వేధింపులు తాళలేక ఆమె బెంగళూరు తూర్పు విభాగం పోలీసులను ఆశ్రయించింది. సొంత ఇల్లు ఉందని నమ్మించి.. అద్దె ఇంట్లో ఉంటున్నారని.. తనను పుట్టింటి నుంచి అదనంగా డబ్బు తేవాలంటూ వేధిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, ఈ ఘటనపై పోలీసులు భర్త ప్రమోద్, మరిది, అత్త మామలపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టారు.