AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంట్లో తిష్టవేసిందని నాగుపామును చంపేశారు.. 80గుడ్లను పాతిపెట్టారు.. కట్‌చేస్తే.. ముగ్గురిపై కేసు నమోదు..

పామును చంపి దాని 80 గుడ్లను భూమిలో పాతిపెట్టిన కేసులో అటవీశాఖ ఫిర్యాదు మేరకు ముగ్గురు గ్రామస్తులపై కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనను కొందరు వీడియో తీశారు. ఆ తర్వాత అటవీ శాఖ చర్యలు ప్రారంభించి..

ఇంట్లో తిష్టవేసిందని నాగుపామును చంపేశారు.. 80గుడ్లను పాతిపెట్టారు.. కట్‌చేస్తే.. ముగ్గురిపై కేసు నమోదు..
Huge Snake
Jyothi Gadda
|

Updated on: Apr 15, 2023 | 6:11 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. అబాద్ అనే వ్యక్తి ఇంటి నుంచి ఆడ నాగు పాము బయటకు రావడంతో గందరగోళం నెలకొంది. ఆ తర్వాత అబాద్ గ్రామస్థులతో కలిసి ఆ సర్పాన్ని చంపేశాడు. ఆ తర్వాత అతని ఇంటిలోపల కనిపించిన దృశ్యాలను చూసి అతడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. పామును చంపేసిన తర్వాత ఇళ్లంతా తనిఖీ చేయగా.. అతని ఇంట్లో 80కి పైగా పాము గుడ్లు కనిపించాయి. దాంతో ఆబాద్‌తో పాటు గ్రామస్తులు సైతం భయాందోళనకు గురయ్యారు. ఒక బకెట్‌లో పాము పడుకుని, పాముకి ఒక వైపు 80 గుడ్లు పడి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.ఈ సంఘటన చర్తల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌని హాజీపూర్ గ్రామంలో వెలుగుచూసినట్టుగా తెలిసింది. పామును చంపి దాని 80 గుడ్లను భూమిలో పాతిపెట్టిన కేసులో అటవీశాఖ ఫిర్యాదు మేరకు ముగ్గురు గ్రామస్తులపై కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనను కొందరు వీడియో తీశారు. ఆ తర్వాత అటవీ శాఖ చర్యలు ప్రారంభించి, భూస్వామి అబాద్‌తో సహా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులపై వన్యప్రాణి క్రైమ్ కింద కేసు నమోదు చేశారు.

అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చంపబడిన ఆడ పాము ధమన్ పాము. దీనిని రేట్ స్నేక్ అని పిలుస్తారు. ఈ ధమన్ స్నేక్ వైట్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం ‘షెడ్యూల్ టూ’ కింద వస్తుంది. ఇది షెడ్యూల్ టూలో వన్యప్రాణుల నేరంగా పరిగణించబడుతుందని చెప్పారు. ఆయా సెక్షన్ల మేరకు చర్యలు తీసుకుంటామని, దాని కేసు వన్యప్రాణి నేరంలో నమోదు చేయబడిందని చెప్పారు.

ముజఫర్‌నగర్ ఫారెస్ట్ ఆఫీసర్ విమల్ కిషోర్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఒక ఇన్‌ఫార్మర్ ద్వారా తమకు పాము చంపేసిన సమాచారం అందిందని చెప్పారు. చర్తల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌని హాజీపూర్ గ్రామంలో ఒక ఇంఆడ పామును చంపేశారని, దానికి కొన్ని గుడ్లు ఉన్నాయని తమకు తెలిసిందన్నారు. స్థానిక వ్యక్తి సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్టుగా వెల్లడించారు. ఇది వన్యప్రాణుల నేరం, వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం చూస్తే, 3 నుండి 7 సంవత్సరాల శిక్ష, 10 వేల జరిమానా ఉంటుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..