Viral: ఆకలేసి అరటిపండ్ల కవర్ ఓపెన్ చేశాడు.. కనిపించిన షాకింగ్ దృశ్యం.. దెబ్బకు గుండె గుభేల్!
యధాలాపంగా ఇంటికి చేరుకున్న తర్వాత ఒక్కొక్కటి సర్దడం మొదలుపెట్టాడు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఈలోపు అతడికి ఆకలేసి ఓ అరటిపండు తినాలనుకున్నాడు. కట్ చేస్తే..
ఓ వ్యక్తి తన ఇంటి దగ్గరలోని సూపర్ మార్కెట్‌లో షాపింగ్‌కు వెళ్లాడు. ఇంటికి కావాల్సిన కూరగాయలతో పాటు కొన్ని పండ్లు, ఓ డజన్ అరటి పండ్లు కొనుగోలు చేసి కవర్‌లో ప్యాక్ చేయించాడు. యధాలాపంగా ఇంటికి చేరుకున్న తర్వాత ఒక్కొక్కటి సర్దడం మొదలుపెట్టాడు. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే ఈలోపు అతడికి ఆకలేసి ఓ అరటిపండు తినాలనుకున్నాడు. కట్ చేస్తే.. కవర్ ఓపెన్ చేయగా దెబ్బకు షాక్ అయ్యాడు. అందులో ఓ భారీ విషపూరితమైన స్పైడర్ అతడికి దర్శనమిచ్చింది. వినడానికే భయంకరంగా ఉంది కదా.! అవునండీ ఈ సంఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది.
క్రైగ్ హర్రిసన్ అనే వ్యక్తికి షాకింగ్ సీన్ ఎదురైంది. సూపర్ మార్కెట్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన అరటిపండ్ల కవర్‌లో అతడికి ఓ భారీ విషపూరితమైన సాలీడు కనిపించింది. అంతేకాదు.. ఆ అరటిపండ్ల చుట్టూ గూడు కట్టుకుని ఏకంగా 200 గుడ్లు కూడా పెట్టిందట. ఇక మనోడు తృటిలో దాని కాటు నుంచి తప్పించుకున్నాడు. ఈ ఊహించని పరిణామం నుంచి తేరుకున్న ఆ వ్యక్తి వెంటనే సాలీడును జాగ్రత్త ఓ టప్పర్‌వేర్ బాక్స్‌లో బంధించి.. సదరు టెస్కో సూపర్ మార్కెట్ పెస్ట్ కంట్రోల్ సర్వీస్‌కు అందించాడు. అనంతరం సదరు కస్టమర్‌కు కలిగిన ఇబ్బందికి ఆ సూపర్ మార్కెట్ 100 పౌండ్లను నష్టపరిహారంగా అందజేశారు.
‘నేను స్టోర్ నుంచి ఈ అరటి పండ్ల ప్యాకెట్ తీసుకున్నప్పుడు.. అందులో స్పైడర్ నక్కిందని తెలియదు. అది అరటిపండ్ల మధ్య కనిపించకుండా గూడుకట్టుకుంది. గుడ్లను కూడా పెట్టింది. బ్యాగ్ ట్రాన్స్‌పెరెంట్‌గా లేకపోవడంతో.. అందులో ఏమున్నాయో స్పష్టంగా కనిపించలేదు. నేను ఇంటికి బ్యాగ్ తీసుకొచ్చి.. దాన్ని తెరిచి ఓ అరటిపండు తిన్న తర్వాత.. అక్కడ సాలీడు గూడు కట్టుకుని ఉందని గమనించాను. నాకు ఎప్పుడూ కూడా స్పైడర్ ఫోబియా లేదు. కానీ ఈ పరిణామం ఎదురైన తర్వాత నుంచి భయం పట్టుకుంది’ అని సదరు వ్యక్తి తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు.