Viral: ఎయిర్‌పోర్ట్‌లో కంగారుగా ముగ్గురు వ్యక్తులు.. డౌట్ వచ్చి.. బ్యాగులు చెక్ చేయగా
ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటారు. చాలా అలెర్ట్‌గా ఉంటూ.. విమానాల్లో వచ్చిన ప్రయాణీకులు ఎవరైనా సరే.. అనుమానం కలిగితే అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతారు. తాజాగా బెంగళూరులోని విమానాశ్రయంలో ఓ ముగ్గురు ప్రయాణీకులపై డౌట్ వచ్చి.. ఇంతకీ ఆ వివరాలు ఏంటంటే..

మీరు మారరురా ఇక.? కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు అమలులోకి తెచ్చినా.. ఈ కేటుగాళ్ల రూట్ మారట్లేదు. పుష్పరాజ్‌ను మించిపోయి మరీ.. తమ క్రియేటివిటీతో స్కెచ్‌లు వేసి.. అక్రమ దందాను రాష్ట్ర సరిహద్దులను మాత్రమే కాదు.. ఏకంగా దేశాలే దాటిస్తున్నారు. తాజాగా ఈ కోవలోనే ఓ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇటీవల రూ. 23 కోట్లు విలువైన గంజాయిని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. బ్యాంకాక్ నుంచి బెంగళూరుకు వచ్చిన ముగ్గురు ప్రయాణీకుల నుంచి ఈ మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. హైడ్రోపోనిక్స్, మైరావాన్, సహా వివిధ రకాలైన గంజాయిను వేర్వేరు కవర్లలో ప్యాక్ చేసి.. వాటిపై పూలను పెట్టి.. ఓ లగేజి బ్యాగ్‌లో ఉంచారు నిందితులు. ల్యాబ్‌లలో అదనపు పోషకాలతో నీటిలో సాగు చేయడానికి ఈ హైడ్రోపోనిక్ గంజాయిని వాడతారట. విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులుగా స్మగ్లర్లు నటిస్తూ.. ఇలా గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారని కస్టమ్స్ అధికారుల విచారణలో తేలింది. కాగా, అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది చదవండి: ఆ రోజులు మళ్లీరావు.. 61 ఏళ్ల కిందట 5 లీటర్ల పెట్రోల్ ధర తెల్సా
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..