TV9 నెట్‌వర్క్‌కు డబుల్ ధమాకా.. సీఈఓ బరున్‌ దాస్‌కు అరుదైన గౌరవం.. న్యూస్9 ప్లస్‌కు WCRCINT అవార్డు..

WCRCINT India's Transformational Awards: భారతీయ వార్తా మీడియా రంగంలో పెను సంచలనం సృష్టించి, అనతికాలంలోనే కోట్లాది మంది ప్రేక్షకుల మన్ననలు పొందిన భారతదేశపు అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్.. TV9 నెట్‌వర్క్ WCRCINT (వరల్డ్ కన్సల్టింగ్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఇంటర్నేషనల్) నుంచి రెండు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది.

TV9 నెట్‌వర్క్‌కు డబుల్ ధమాకా.. సీఈఓ బరున్‌ దాస్‌కు అరుదైన గౌరవం.. న్యూస్9 ప్లస్‌కు WCRCINT అవార్డు..
TV9 Network MD & CEO Barun Das
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 21, 2023 | 7:29 AM

WCRCINT India’s Transformational Awards: భారతీయ వార్తా మీడియా రంగంలో పెను సంచలనం సృష్టించి, అనతికాలంలోనే కోట్లాది మంది ప్రేక్షకుల మన్ననలు పొందిన భారతదేశపు అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్.. TV9 నెట్‌వర్క్ WCRCINT (వరల్డ్ కన్సల్టింగ్ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్ ఇంటర్నేషనల్) నుంచి రెండు ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. TV9 నెట్‌వర్క్ MD, CEO బరున్ దాస్‌కు ఇండియాస్ ట్రాన్స్‌ఫార్మేషనల్ లీడర్ 2023 అవార్డు లభించింది. అలాగే, TV 9 నెట్‌వర్క్ ప్రారంభించిన ప్రపంచంలోని మొట్టమొదటి వార్తల OTT ప్లాట్‌ఫారమ్ News9 Plusను WCRCINT ఇండియాస్ ట్రాన్స్‌ఫార్మేషనల్ బ్రాండ్ (భారతదేశ పరివర్తన బ్రాండ్ 2023) గా గుర్తించి సత్కరించింది.

మీడియా రంగానికి TV9 MD, CEO బరున్ దాస్ చేసిన కృషికి, అతని అసాధారణ నాయకత్వానికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. బరున్ దాస్ నాయకత్వంలో టీవీ9 నెట్‌వర్క్ రోజురోజుకూ బలపడటంతోపాటు.. కోట్లాదిమంది ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. భారతదేశంతోపాటు.. ఇతర ప్రాంతాలలో మిలియన్ల మంది వీక్షకులకు వార్తలు, సమాచారాన్ని అందిస్తోంది. పాత్రికేయ నైపుణ్యం, విశ్వసనీయత, నిబద్ధత, నూతన ఆవిష్కరణలను కొనసాగిస్తూ TV9 నెట్‌వర్క్‌ను దేశంలోని ప్రముఖ న్యూస్ నెట్‌వర్క్‌గా మార్చడంలో బరున్ దాస్ కీలక పాత్ర పోషించారు.

News9 Plus

News9 Plus

TV9 అసాధారణ, అద్భుతమైన వృద్ధికి ఈ గుర్తింపు నిదర్శనం: Barun Das, MD & CEO of TV9 Network

ఈ ప్రతిష్టాత్మక అవార్డు వేడుక ఏప్రిల్ 18, 2023న న్యూ ఢిల్లీలోని ఈరోస్ హోటల్‌లో జరిగింది. అవార్డు అందుకున్న తర్వాత TV9 నెట్‌వర్క్ MD, CEO బరున్ దాస్ మాట్లాడుతూ.. ‘WCRCINT నుంచి ట్రాన్స్‌ఫర్మేషనల్ లీడర్ ఆఫ్ ఇండియా 2023 అవార్డును అందుకున్నందుకు సంతోషంగా ఉంది. వేగంతో ముందుకు సాగుతున్న TV9 నెట్‌వర్క్ వంటి పెద్ద నౌకలో.. ప్రతిదీ చాలా ముఖ్యమైనది.. TV9 అసాధారణ, అద్భుతమైన వృద్ధికి ఈ గుర్తింపు నిదర్శనం.. ప్రతి ఉద్యోగి, సమిష్టి కృషి ఫలితంగా ఈ అవార్డు దక్కింది.. న్యూస్ 9 ప్లస్ 2023లో ఒక వినూత్న ప్రయోగం.. ట్రాన్స్‌ఫార్మేషనల్ న్యూస్ బ్రాండ్‌గా గుర్తింపు పొందినందుకు నేను సంతోషిస్తున్నాను.

ఇవి కూడా చదవండి
Tv9 Network Md & Ceo Barun Das

Tv9 Network Md & Ceo Barun Das

మీడియా లెజెండ్ బరున్ దాస్..

డబ్ల్యుసిఆర్‌సి ఎడిటర్-ఇన్-చీఫ్ అభిమన్యు ఘోష్ బరున్ దాస్‌ను ఇండియాస్ ట్రాన్స్‌ఫర్మేషనల్ లీడర్ 2023 అవార్డుకు ఎందుకు ఎంపిక చేశారనే కారణాలను తెలిపారు. బరున్ దాస్ భారతీయ మీడియా లెజెండ్ అంటూ కొనియాడారు.. ‘‘ మీడియా లెజెండ్ బరున్ దాస్.. తన సుదీర్ఘ కెరీర్‌లో, ఆయన అనేక మీడియా నెట్‌వర్క్‌లను మార్చడంతోపాటు అందరి దృష్టిని ఆకర్షించారు. మొత్తం పరిశ్రమలో అత్యంత కీలకమైన కొందరి పేర్లలో ఆయన ఒకరు.. . మా పరిశోధనలన్నింటిలో మేము కనుగొన్నది ఏమిటంటే, దాస్ భారతదేశంలోని అత్యంత విశ్వసనీయమైన మీడియా ప్రముఖులలో అన్ని కాలాలలోనూ స్థానం సంపాదించారు’’ అని WCRC ఎడిటర్-ఇన్-చీఫ్ అభిప్రాయపడ్డారు .

ట్రాన్స్‌ఫర్మేషనల్ లీడర్స్.. బ్రాండ్స్..

WCRCINT ఇండియా ట్రాన్స్‌ఫర్మేషనల్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ 2023.. అనేది ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపే విధంగా తమ నాయకత్వం, బ్రాండింగ్, ఉత్పత్తి ఆవిష్కరణల ద్వారా దేశంలో గణనీయమైన మార్పును తీసుకువస్తున్న భారతదేశపు అత్యుత్తమ బ్రాండ్‌లు.. వాటి నాయకులను గుర్తించి గౌరవించే ప్రతిష్టాత్మక వేదిక.

Wcrcint Award 2023

Wcrcint Award 2023

న్యూస్ 9 ప్లస్ దాని ఆవిష్కరణకు ఇదే నిదర్శనం. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి వార్తల OTT ప్లాట్‌ఫారమ్. OTT వాతావరణంలో చాలా సున్నితమైన రిపోర్టింగ్, వార్తల డాక్యుమెంటరీలు ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నారు. . వాస్తవ-ఆధారిత, పాత్రికేయ నిబద్ధత మార్గదర్శకాలకు అనుగుణంగా చాలా వివరణాత్మక నివేదికలను ఈ ప్లాట్‌ఫారమ్‌లో చూడవచ్చు

TV9 నెట్‌వర్క్ ప్రారంభించిన ప్రపంచంలోని మొట్టమొదటి న్యూస్ OTT ప్లాట్‌ఫారమ్ అయిన News9 Plus.. WCRCINT ఇండియాస్ ట్రాన్స్‌ఫార్మేషనల్ బ్రాండ్ 2023గా గుర్తింపు పొందింది. News9 Plus కొత్త యుగం.. మంచి OTT తావరణంలో సూక్ష్మమైన, అద్భుతమైన వార్తల రిపోర్టింగ్, న్యూస్ డాక్యుమెంటరీలను ప్రజలకు ఉచితంగా అందుబాటులో ఉంచుతుంది. వాస్తవ-ఆధారిత, పాత్రికేయ నిబద్ధత మార్గదర్శకాలకు అనుగుణంగా చాలా వివరణాత్మక, బహుముఖ కథనాలను, నివేదికలను రూపొందించి ఈ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంచుతుంది..

అంతర్జాతీయ ప్రమాణాలతో వార్తలు..

న్యూస్ 9 ప్లస్ యాప్‌ను ఇప్పటికే చాలా మంది ప్రశంసించారు. నటుడు, నిర్మాత అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ ‘న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ వేగంగా మారుతున్న తరుణంలో న్యూస్ 9 ప్లస్ చాలా సరళంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో వార్తలను అందిస్తోంది’ అని కొనియాడారు.

వార్తా మీడియాలో గేమ్ ఛేంజర్‌

‘TV9 నెట్‌వర్క్ చాలా మంచి సెగ్మెంట్‌ని ఎంచుకుంది. ఇది చాలా బాగా కొనసాగుతుందనడంలో సందేహం లేదు. News 9 Plus కి నా శుభాకాంక్షలు. ఈ యాప్‌ను అద్భుతంగా రూపొందించడానికి బృందం నిజంగా కృషి చేస్తోంది. ఈ యాప్ వార్తా మీడియాలో గేమ్ ఛేంజర్‌గా మారవచ్చు’ అని MakeMyTrip.com వ్యవస్థాపకుడు దీప్ కల్రా అన్నారు.

విధానం బాగా నచ్చింది..

అలాగే , చిత్ర దర్శకుడు, నిర్మాత ఆర్ బాల్కీ న్యూస్ 9 ప్లస్ ప్రత్యేక నివేదికలను ప్రశంసించారు. న్యూస్ 9 ప్లస్ అనేది ప్రపంచంలోని మొట్టమొదటి వార్తా OTT. విభిన్న అంశాలు, మంచి నిర్మాణాలు వార్తా కథనాలు పరిధిని దాటి ప్రజలను తీసుకువెళతాయి. ఈ నివేదికలను సమర్పించే విధానం చాలా కాలం పాటు వాటిని అప్రస్తుతం చేస్తుంది. అతను ప్రెజెంట్ చేసే విధానం నాకు బాగా నచ్చింది’ అని ఆర్ బాల్కీ అభిప్రాయపడ్డారు .

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో ఆడిపాడిన హీరో ఎవరో తెల్సా...
ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో ఆడిపాడిన హీరో ఎవరో తెల్సా...
ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకుని ప్రధానమంత్రులు..!
ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకుని ప్రధానమంత్రులు..!
ముగిసిన మూడో రోజు.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం
ముగిసిన మూడో రోజు.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం
బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసి ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే..
బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసి ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే..
నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
ఏపీ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త..
ఏపీ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త..
ఫ్రెండ్ పెళ్లి కోసం ఖమ్మం వచ్చిన విదేశీ దంపతులు.. పెళ్లింట సందడి
ఫ్రెండ్ పెళ్లి కోసం ఖమ్మం వచ్చిన విదేశీ దంపతులు.. పెళ్లింట సందడి
Video: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ సెలబ్రేషన్స్‌ చూశారా?
Video: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ సెలబ్రేషన్స్‌ చూశారా?
లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్న కావ్య, రాజ్‌లు.. రుద్రాణి అనుమానం!
లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్న కావ్య, రాజ్‌లు.. రుద్రాణి అనుమానం!
ఆ రోజుల్లో టికెట్లు, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లొద్దు..
ఆ రోజుల్లో టికెట్లు, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లొద్దు..