Bank Holidays in August: బ్యాంక్ కస్టమర్స్ కు అలెర్ట్.. ఆగస్టులో 14 రోజులు సెలవులు.. ఫుల్ డీటైల్స్ మీ కోసం..
ఎవరైనా బ్యాంకుకు సంబంధించిన వ్యవహారాలను నిర్వహించాలనుకుంటే ఖచ్చితంగా సెలవులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాల్సిందే.. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను అనుసారించి ప్రభుత్వ సెలవు దినాలలో అన్ని బ్యాంకులు మూసివేస్తారు. అంతేకాదు కొన్ని బ్యాంకులకు ఆయా రాష్ట్రానికి సంబంధించిన పండగలు, పర్వదినాలను సెలవులుగా ఇస్తారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. రెండు రోజుల్లో జూలై నెల ముగిసి ఆగష్టు నెలలో అడుగు పెట్టనున్న నేపథ్యంలో తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆగస్టు నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. దేశంలోని వివిధ జోన్లలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఎవరైనా బ్యాంకుకు సంబంధించిన వ్యవహారాలను నిర్వహించాలనుకుంటే ఖచ్చితంగా సెలవులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాల్సిందే.. ఎవరైనా ఖాతాను తెరవబోతున్నా లేదా బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ఇతర ముఖ్యమైన పనిని చేయాలనుకున్నా ఈ సెలవుల జాబితాను పరిగణించాలి. ఆగస్టు నెలలో మొత్తం 14 రోజులు బ్యాంకులకు సెలవులు దినాలు. రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలను అనుసారించి ప్రభుత్వ సెలవు దినాలలో అన్ని బ్యాంకులు మూసివేస్తారు. అంతేకాదు కొన్ని బ్యాంకులకు ఆయా రాష్ట్రానికి సంబంధించిన పండగలు, పర్వదినాలను సెలవులుగా ఇస్తారు.
ఆగష్టు నెలలో సెలవు రోజులు
- 6 ఆగస్టు 2023 – ఆదివారం వారాంతపు సెలవు
- 8 ఆగస్టు 2023 – గ్యాంగ్‌టక్‌లో టెండాంగ్ ల్హో రమ్ ఫ్యాట్ కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
- 12 ఆగస్టు 2023 – రెండవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి
- 13 ఆగస్టు 2023 – ఆదివారం వారాంతపు సెలవు
- 15 ఆగస్టు 2023 – స్వాతంత్య్ర దినోత్సవం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది
- 16 ఆగస్టు 2023 – పార్సీ నూతన సంవత్సరం కారణంగా ముంబై, నాగ్‌పూర్ , బేల్పూర్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి.
- 18 ఆగస్టు 2023 – శ్రీమంత్ శంకర్‌దేవ తిథి కారణంగా గౌహతిలో బ్యాంకులు మూసివేయబడతాయి.
- 20 ఆగస్టు 2023 – ఆదివారం వారాంతపు సెలవు
- 26 ఆగష్టు 2023 – ఈ రోజు 27 ఆగస్ట్ 2023 నాల్గవ శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయబడతాయి
- 27 ఆగస్టు 2023-ఆదివారం వారాంతపు సెలవు
- 28 ఆగస్టు 2023- మొదటి ఓనం కారణంగా కొచ్చి, తిరువనంతపురంలో బ్యాంకులు మూసివేయబడతాయి
- 29 ఆగస్టు – తిరువోణంకారణంగా కోచి, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు
- 30 ఆగస్టు 2023 – రక్షా బంధన్ కారణంగా అనేక ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి
- 31 ఆగస్టు 2023 – శ్రీ నారాయణ గురు జయంతి, పాంగ్-లహబ్ సోల్ కారణంగా డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలో బ్యాంకులు మూసివేయబడతాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..