Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద మృతుల కోసం ఊరి ప్రజల సామూహిక కర్మకాండలు..

ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన జరిగి 10 రోజులు దాటింది. ఈ విషాదం నుంచి ఇంకా ఎన్నో కుటుంబాలు తేరుకోలేదు. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి బహనాగ గ్రామంలోని స్థానికులు.. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కర్మకాండలు నిర్వహించారు.

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద మృతుల కోసం ఊరి ప్రజల సామూహిక  కర్మకాండలు..
Bahanga Locals
Follow us
Aravind B

|

Updated on: Jun 12, 2023 | 3:08 PM

ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన జరిగి 10 రోజులు దాటింది. ఈ విషాదం నుంచి ఇంకా ఎన్నో కుటుంబాలు తేరుకోలేదు. అయితే ఈ ప్రమాదం జరిగినటువంటి బహానగ గ్రామంలోని స్థానికులు.. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కర్మకాండలు నిర్వహించారు. ఈ విషాదం జరిగి ఆదివారం నాటికి పది రోజులు కావడంతో ఆ గ్రామంలో దాదాపు 116 మంది ప్రజలు వారి గుండ్లు గీయించుకున్నారు. అనంతరం దగ్గర్లోని చెరువులో స్నానం చేసి కొత్త దూస్తులు ధరించారు. సాయత్రం పూట మృతుల కోసం ఆహారాన్ని కూడా సమర్పించారు.

ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ గ్రామంలోని స్థానికులు సహాయక బృందాలతో కలిసి వందలాది మందిని కాపాడారని.. ఎన్నో మృతదేహలను వెలికి తీశారని బహానగకి చెందిన పంచాయతి సమితి సభ్యుడు శరత్ రాజ్ తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారిని సైతం తమ కుటుంబ సభ్యులుగానే భావించామని.. మా కుటుంబీకులు ఎవరైన చనిపోతే ఎలాంటి ఆచారాలు, నియమాలు పాటిస్తామో.. ఈ రైలు ప్రమాదంలో మరణించిన వారి కోసం కూడా ఆ విధానాలనే పాటించామని పేర్కొన్నారు. అయితే ఇంకా 81 మంది మృతులను గుర్తించకపోవడంతో వారిని తమ కుటుంబీకులకు అధికారులకు అందజేయలేదని చెప్పారు. ఇదిలా ఉండగా ఈ ఘోర రైలు ప్రమాదంలో 288 మంది ప్రయాణికులు మృతి చెందారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం