Azadi Ka Amrit Mahotsav: చరిత్ర చెప్పని పాఠం.. నీరా ఆర్య.. నేతాజీని రక్షించేందుకు భర్తనే చంపేసిన స్వాతంత్ర సమర వీరాంగని

Neera Arya: సుభాష్ చంద్ర బోసు స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లోని రాణి ఝాన్సీ రెజిమెంట్‌కు చెందిన సైనికురాలు  నీరా ఆర్య. బ్రిటిష్ వారు ఆజ్ఞ మేరకు సుభాష్ చంద్ బోస్ పెట్టుకోడానికి లేదా చంపడానికి ప్రయత్నిస్తున్న సిఐడి ఇన్‌స్పెక్టరైన తన భర్త శ్రీకాంత్ జైరంజన్‌ను హత్య చేసిన ధీర వనిత గురించి నేడు తెలుసుకుందాం.. 

Azadi Ka Amrit Mahotsav: చరిత్ర చెప్పని పాఠం.. నీరా ఆర్య.. నేతాజీని రక్షించేందుకు భర్తనే చంపేసిన స్వాతంత్ర సమర వీరాంగని
Neera Arya
Follow us
Surya Kala

|

Updated on: Aug 02, 2022 | 5:32 PM

Azadi Ka Amrit Mahotsav: మనం నేడు అనుభవిస్తున్న స్వేచ్చా స్వాతంత్య్రల వెనుక ఎందరో వీరుల త్యాగాలు, ఆర్తనాదాలు, బలిదానాలున్నాయి. అయితే స్వాతంత్య సమరంలో  చరిత్ర లో మనకు కనిపించకుండా కనుమరుగు అయిన ఎందరో వీరులు, వీర వనితాలున్నారు. మన కళ్ళకు కనిపించే వాళ్ళు కొందరే.. ఆలాంటి ధీరురాలు నీరా ఆర్య. బ్రిటిష్ ప్రభుత్వంలో సీఐడీ గా పనిచేస్తోన్న తన భర్తని సుభాష్ చంద్ర బోసు కోసం చంపిన సమరయోధురాలు నీరా ఆర్య. సుభాష్ చంద్ర బోసు స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లోని రాణి ఝాన్సీ రెజిమెంట్‌కు చెందిన సైనికురాలు  నీరా ఆర్య. బ్రిటిష్ వారు ఆజ్ఞ మేరకు సుభాష్ చంద్ బోస్ పెట్టుకోడానికి లేదా చంపడానికి ప్రయత్నిస్తున్న సిఐడి ఇన్‌స్పెక్టరైన తన భర్త శ్రీకాంత్ జైరంజన్‌ను హత్య చేసిన ధీర వనిత గురించి నేడు తెలుసుకుందాం..

నీరా ఆర్య మార్చి 5, 1902న ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలో జన్మించారు. నీరా ఆర్యకు కేవలం ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు..  తల్లి లక్ష్మీ దేవి, తండ్రి మహావీర్ అంటువ్యాధి కారణంగా మరణించారు. తమ్ముడు బసంత్ బాధ్యత కూడా నీరా పైనే పడింది. ఖేక్రాలో జరిగిన ఆర్య సమాజ్ సమావేశానికి హాజరయ్యేందుకు కలకత్తా నుండి వచ్చిన సేథ్ ఛజుమల్ నీరా, ఆమె సోదరుడిని దత్తత తీసుకున్నాడు. దీంతో నీరా కలకత్తాలో చదువుకుంది.

బ్రిటిష్ ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌  అధికారి శ్రీకాంత్ జైరంజన్‌. నీరా తన భర్త చాలా మంది స్వాతంత్య్ర సమరయోధులను పట్టుకున్నారని వివాహం తర్వాత తెలిసింది. అంతేకాదు తన భర్త బ్రిటీష్ అధికారుల సహాయంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను హత్య చేయాలని ప్లాన్ చేస్తున్నాడని ఆమెకు తెలిసింది. దీంతో కోపోద్రిక్తులైన నీరా తన భర్తకు ప్రభుత్వ ఉద్యోగం.. లేదా తనని ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోవాలని సూటిగా చెప్పింది. అయితే నీరా భర్త ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. నీరా ఆర్య  తన అత్తారింటిని విడిచిపెట్టింది. నీరా కలకత్తా నుండి ఢిల్లీలోని షహదారాకు తన గాడ్ ఫాదర్ ఆచార్య చతుర్సేన్ వద్దకు వెళ్లింది. షహదారాలో నివసిస్తున్న సమయంలో నీరా పిల్లలకు సంస్కృతం, ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పడం ప్రారంభించింది. ఈ సమయంలో నీరా ఖేక్రాలోని సంక్రౌడ్ గ్రామంలో జరిగే తీజ్ జాతరకు వచ్చింది. జాతరలోనే నీరాకు రామ్ సింగ్ ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరి సింగపూర్ వెళ్లిన విషయం తెలిసింది. దీనిపై నీరా.. సింగపూర్ వెళ్లి ఆజాద్ హింద్ ఫౌజ్ లో చేరాలనుకుంటున్నట్లు చెప్పింది. దీంతో రామ్ సింగ్ అంగీకరించాడు. దీని తర్వాత నీరా తన తమ్ముడు బసంత్  సహా బాగ్‌పత్‌కు చెందిన మరికొందరితో ఆజాద్ హింద్ ఫౌజ్ ఝాన్సీ రెజిమెంట్‌లో రిక్రూట్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

రెజిమెంట్ మొదటి కమాండర్ డాక్టర్ లక్ష్మీ సెహగల్, సెక్రటరీ మాన్వతి ఆర్య నేతృత్వంలో నీరా ఆర్య సైనిక శిక్షణ పొందింది. 22 అక్టోబర్ 1943న.. సుభాష్ చంద్రబోస్ రాణి ఝాన్సీ రెజిమెంట్‌ను అధికారికంగా ప్రకటించారు. నీరా ఆర్య సామర్థ్యాన్ని చూసి ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌లో బ్రిటిష్ వారిపై గూఢచర్యం చేసే బాధ్యతను అప్పగించారు. అందుకే ఆమెను దేశ తొలి మహిళా గూఢచారి అని కూడా అంటారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ పవిత్రా మోహన్ రాయ్ ఆదేశాల మేరకు నీరా ఆర్య తన స్నేహితులైన సరస్వతి రాజమణి, జాంకీ, బేల, దుర్గా తదితరులతో కలిసి గూఢచర్య బాధ్యతలు చేపట్టింది.  అబ్బాయిల దుస్తులు ధరించి బ్రిటిష్ అధికారుల ఇళ్లలో పనిచేయడం ప్రారంభించారు. ఓ సారి గూఢచర్యం చేస్తుండగా దుర్గ పట్టుబడింది. నీరా, సరస్వతి రాజమణి నపుంసకుల వేషంలో జైలు దగ్గరకు చేరుకుని వారికి మత్తు తినిపించి బ్రిటిష్ అధికారులను, సైనికులను అపస్మారక స్థితికి చేర్చి దుర్గను రక్షించారు. అకస్మాత్తుగా ఒక సైనికుడు స్పృహలోకి వచ్చి కాల్పులు జరిపాడు. పారిపోయిన సరస్వతి రాజమణి పాదాలకు తగిలినా ధైర్యం కోల్పోకుండా అడవిలో చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకుంది. ముగ్గురూ ఆజాద్ హింద్ ఫౌజ్ బేస్ క్యాంపుకు చేరుకున్నప్పుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముగ్గురి ధైర్యాన్ని ప్రశంసించారు. అనంతరం నీరా ఆర్యను కెప్టెన్‌గా చేశారు. సుభాష్ చంద్రబోస్‌ను రక్షించే బాధ్యత నీరా ఆర్యకు అప్పగించారు.

ఒక రాత్రి తనను నేతాజీ శిబిరంలో రక్షణ కోసం తనను ఉంచగా.. ఎవరో బోసు.. సమీపంలో ఉన్నారని తాను గ్రహించానని నీరా ఆర్య తన ఆత్మకథ మేరా జీవన్ సంఘర్ష్‌లో రాశారు. సుభాష్ చంద్రబోసు ని చంపడానికి నీరా భర్త శ్రీకాంత్ జయరంజన్ చేతిలో రివాల్వర్ పట్టుకుని నిలబడ్డాడు. సుభాష్ చంద్రబోస్‌పై శ్రీకాంత్ కాల్పులు జరిపాడు.. అంతేకాదు అప్పటికే సుభాష్ డ్రైవర్ నిజాముద్దీన్ ని కాల్చి చంపారు. దీంతో నీరారైఫిల్‌లోని బయోనెట్‌తో తన భర్తను చంపింది. అనంతరం నీరా ఆర్య ఆజాద్ హింద్ ఫౌజ్ కోసం గూఢచర్యం చేస్తూనే ఉంది. అయితే 1945 మే 3న బ్రిటీష్ వారు నీరాను అరెస్టు చేశారు. కలకత్తా జైలులో ఉంచారు. అక్కడ అనేక చిత్ర హింసలకు గురిచేశారు. కాలాపాణికి పంపగా అక్కడ నుంచి నీరా మరో ఇద్దరు సహచరులతో తప్పించుకుంది.

బాగ్‌పత్‌లోని ఖేక్రా నివాసి..  తేజ్‌పాల్ ధామా మాట్లాడుతూ.. , దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. నిజాం పాలకుల నుంచి హైదరాబాద్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో నీరా ఆర్య కూడా ప్రత్యేక పాత్ర పోషించారని చెప్పారు. జూలై 26, 1998న నీరా ఆర్య అనారోగ్యంతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచింది. అప్పుడు తేజ్‌పాల్ ధామా తన సహచరులతో కలిసి అతని అంత్యక్రియలు నిర్వహించారు. తేజ్‌పాల్, భార్య మధుతో కలిసి ఆజాద్ హింద్ ఫౌజ్ మొదటి మహిళా గూఢచారి నీరా ఆర్య హైదరాబాద్‌లో గడిపిన రోజుల గురించి ఒక పుస్తకం రాశారు. నీరా ఆర్య పేరుతో కేరళలో ఓ రోడ్డు ఉందని.. ఆమె పేరు మీదనే జాతీయ స్థాయి నీరా ఆర్య అవార్డు కూడా ఇస్తుందని.. తేజ్‌పాల్ వివరించారు. ప్రతి సంవత్సరం నీరా ఆర్య జయంతి సందర్భంగా ఖేక్రాలో ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. ఖేక్రాలోని ఆర్యసమాజ్ ఆలయ సముదాయంలో నీరా ఆర్య జ్ఞాపకార్థం స్మారక చిహ్నం నిర్మాణం కూడా చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..