CBN in Delhi: ఢిల్లీ పర్యటనలో బాబు బిజీబిజీ.. ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో పాల్గొన్న టీటీడీ అధినేత
ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో పాల్గొవడానికి చంద్రబాబు కు ఆహ్వానం పంపింది కేంద్రం. దీంతో ఢిల్లీ వెళ్లిన బాబు....పార్టీ ఎంపీలు, సీనియర్ నేతలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది మురుము ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Chanadrababu Delhi Tour: టీడీపీ(TDP) ఆధినేత చంద్రబాబు సుదీర్ఘ కాలం తర్వాత ఢిల్లీ వెళ్లారు. ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో (Azadi ka Amrit Mahotsav) చంద్రబాబు పాల్గొన్నారు.గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేవలం రెండుసార్లు మాత్రమే ఢిల్లీ వెళ్లారు బాబు. దీంతో బాబు పర్యటన ఆసక్తిగా మారింది. 2019 ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత కలిపి కేంద్రంలో చక్రం తిప్పాలని భావించారు. కానీ ఫలితాలు తారుమారు కావడంతో ఢిల్లీ కి దూరంగా ఉంటున్నారు. గతేడాది టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి జరిగినప్పుడు ఒకసారి ఢిల్లీ వెళ్లారు బాబు. పార్టీ కార్యాలయం పై దాడిపై అప్పటి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. మూడేళ్ళలో ఒకసారి మాత్రమే ఢిల్లీ వెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ ఇంతకాలం తర్వాత ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లారు టీడీపీ చీఫ్.
ఆజాదీ కా అమృత్ ఉత్సవాల్లో పాల్గొవడానికి చంద్రబాబు కు ఆహ్వానం పంపింది కేంద్రం. దీంతో ఢిల్లీ వెళ్లిన బాబు….పార్టీ ఎంపీలు, సీనియర్ నేతలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తరువాత ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో పాల్గొన్నారు. రాజకీయ పరమైన సమావేశాలు లేకున్నా.. చాలా కాలం తర్వాత చంద్రబాబు పర్యటన రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.
Reporter: MP Rao, Tv9 Telugu