AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Azadi ka Amrit Mahotsav: త్రివర్ణ పతాకంతో స్కూటీపై హస్తినలో చక్కర్లు కొట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. వీడియో వైరల్

దేశ రాజధాని హస్తిన వీధుల్లో బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ పవార్..  కేంద్ర స్మృతి ఇరానీ లు స్కూటీపై చక్కర్లు కొట్టారు.

Azadi ka Amrit Mahotsav: త్రివర్ణ పతాకంతో స్కూటీపై హస్తినలో చక్కర్లు కొట్టిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. వీడియో వైరల్
Azadi Ka Amrit Mahotsav
Surya Kala
| Edited By: Janardhan Veluru|

Updated on: Aug 04, 2022 | 3:08 PM

Share

Azadi ka Amrit Mahotsav: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గత కొన్ని రోజులుగా చర్చలో నిలుస్తూనే ఉన్నారు. మరణించిన ఓ వ్యక్తి పేరుతో స్మృతి ఇరానీ కూతురు గోవాలో బార్ నడుపుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. స్మృతి ఇరానీ..  కాంగ్రెస్ నేతల ఆరోపణకు చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా స్మృతి ఇరానీ కొత్త స్టైల్‌లో కనిపించారు.  స్మృతి ఇరానీ స్కూటీపై వెళుతూ కనిపించారు. ఢిల్లీలోని అత్యంత రద్దీగా ఉండే రోడ్లలో స్కూటీ నడుపుతూ తన సహాయ కేంద్ర మహిళా మంత్రి భారతి పవార్ ను స్మృతి ఇరానీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సమయంలో చిత్రీకరించిన ఓ వీడియోను యూనియన్ స్మృతి ఇరానీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ లో షేర్ చేశారు.

దేశ రాజధాని హస్తిన వీధుల్లో బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ పవార్..  కేంద్ర స్మృతి ఇరానీ లు స్కూటీపై చక్కర్లు కొట్టారు. అయితే స్మృతి స్కూటీ ని నడుపుతుండగా.. వెనుక భారతీ కూర్చుకుని ఉన్నారు. డాక్టర్ భారతీ పవార్‌ని స్కూటీమీద ఆఫీస్ వద్ద డ్రాప్ చేశారు. స్మృతి ఇరానీ షేర్ చేసిన ఈ వీడియోలో కేంద్ర మంత్రి చాలా అందంగా కనిపిస్తున్నారు. ఎర్రటి పూల డిజైన్ చీర, కళ్లకు అద్దాలు, హెల్మెట్ ధరించి ఉన్నారు. స్కూటీలో వెనుక కూర్చున్న ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ పవార్ చేతిలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని కనిపించారు.

ఇవి కూడా చదవండి

త్రివర్ణ పతాకలతో ఎంపీల  బైక్ ర్యాలీ.. స్వాతంత్య్ర అమృత మహోత్సవంలో భాగంగా భారత ప్రభుత్వం త్రివర్ణ పండుగను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో భాగంగా మంగళవారం ఎర్రకోట నుంచి ఎంపీల బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర పార్లమెంటరీ మంత్రి ప్రహ్లాద్ జోషి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో స్మృతి ఇరానీ తెల్లటి స్కూటీతో  పాల్గొన్నారు. ఎంపీ ర్యాలీలో స్మృతి ఇరానీ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుపుకుంటున్న అమృత మహోత్సవంలో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

హర్ ఘర్ త్రివర్ణ ప్రచారాన్ని ప్రారంభం.. స్వాతంత్య్ర అమృత మహోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్‌ ఉద్యమంలో భాగంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడు తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ ఎపిసోడ్‌లో ప్రధానితో సహా మొత్తం మంత్రివర్గం, అన్ని శాఖలు సోషల్ మీడియాలో తమ తమ ఖాతాల డీపీలో త్రివర్ణ పతాకాన్ని ఉంచాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..