AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Azadi ka Amrit Mahotsav: ‘హర్ ఘర్ తిరంగ’ ఉద్యమంలో భాగమైన 50మంది ఖైదీలు.. 15 వేల త్రివర్ణ పతకాల తయారీ

దాదాపు 50 మంది ఖైదీలు త్రివర్ణ పతాకాలను తయారు చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ 50 మంది...  ఖైదీల తరపున దాదాపు 15,000 త్రివర్ణ పతాకాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Azadi ka Amrit Mahotsav: 'హర్ ఘర్ తిరంగ' ఉద్యమంలో భాగమైన 50మంది ఖైదీలు.. 15 వేల త్రివర్ణ పతకాల తయారీ
National Flag
Follow us
Surya Kala

|

Updated on: Aug 04, 2022 | 2:08 PM

Azadi ka Amrit Mahotsav: ప్రధానమంత్రి నరేంద్రమోడీ ‘హర్ ఘర్ తిరంగ’ (Har Ghar Tiranga) ఉద్యమం చేపట్టారు. ఈనెల 13 నుంచి 15 వరకూ దేశ ప్రజలందరూ.. తమ ఇంటిపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో మేము సైతం అంటున్నారు ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జైలులో ఉన్న ఖైదీలు. ఘజియాబాద్‌లోని దస్నా జైలులో ఉన్న ఖైదీల తరపున త్రివర్ణ పతాకాలను భారీగా తయారు చేసేందుకు జైలు పరిపాలన సంస్థ నుంచి శిక్షణ తీసుకున్నారు. అనంతరం దాదాపు 50 మంది ఖైదీలు త్రివర్ణ పతాకాలను తయారు చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ 50 మంది…  ఖైదీల తరపున దాదాపు 15,000 త్రివర్ణ పతాకాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఈ జాతీయ పతకాలను ఇంటింటికీ పంపిణి చేయనున్నారు. హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో జాతీయ జెండాలను ఎగురవేయనున్నారు.

ప్రధాని మోదీ ‘హర్ ఘర్ తిరంగ’ ఉద్యమానికి ఘజియాబాద్ జైలులో ఉన్న ఖైదీలు కూడా సహకరిస్తున్నారు. జైల్లో ఉన్న ఖైదీలకు త్రివర్ణ పతాకాన్ని తయారు చేసేందుకు శిక్షణ ఇచ్చారు. జైలు లోపల దాదాపు 50 మంది ఖైదీలు త్రివర్ణ పతాకాలను తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. జైల్లో తయారైన ఈ త్రివర్ణ పతాకాలను ‘హర్ ఘర్ త్రివర్ణ’ కార్యక్రమం కింద వినియోగించనున్నారు. ఈ జెండాలను జైలులోనే కాకుండా జైలు బయట కూడా ప్రజలకు పంపిణీ చేయనున్నారు  తద్వారా ప్రతి ఇంటిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయవచ్చు.

దాస్నా జైలులో ఖైదీల స్వాతంత్య్ర వేడుకలు:  స్వాతంత్య్ర దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని.. స్వాతంత్య్ర అమృత మహోత్సవ సందర్భంగా దేశ వ్యాప్తంగా సందడి మొదలైంది. మీరట్‌లోని ఒక సంస్థ దాస్నా జైలులో ఉన్న ఖైదీలకు శిక్షణ ఇచ్చింది. శిక్షణ అనంతరం టైలరింగ్ పని తెలిసిన ఖైదీలను ఎంపిక చేశారు. శిక్షణ పొందిన ఖైదీల సంఖ్య దాదాపు 50 వరకు ఉందని జైలు అధికారి చెప్పారు.  ఈ 50 మంది ఖైదీలు కలిసి దాదాపు 15,000 త్రివర్ణాలను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా తయారు చేసిన త్రివర్ణ పతకాల్లో సుమారు 6000 త్రివర్ణ పతాకాలను హాపూర్ జిల్లా మేజిస్ట్రేట్‌కు పంపించనున్నామని చెబుతున్నారు. ఖైదీలు తయారు చేసిన త్రివర్ణ పతాకాన్ని ఇంటింటికీ, ప్రభుత్వ భవనాలపై ఎగురవేసే విధంగా పంపిణీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

ఖైదీల్లో ఉత్సాహం: జైలర్ అలోక్ సింగ్ మాట్లాడుతూ.. త్రివర్ణ పతాకాన్ని తయారు చేసే ఖైదీల్లో ఎంతో ఉత్సాహం నెలకొందని చెప్పారు. ఖైదీల్లో దేశభక్తి  పరిమళాన్ని తామంతా చూస్తున్నామని తెలిపారు. ఖైదీలు ఈ కార్యక్రమంలో భాగమైనందుకు గర్వపడుతున్నారని తెలిపారు. జెండాలను తయారు చేయడం ద్వారా తాము కూడా దేశ స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో భాగం అయ్యామని వారు భావిస్తున్నారు. జైల్లో చేపట్టిన ఈ దీక్షపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఖైదీలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..