Indian National Flag: భారత త్రివర్ణ పతాకం గురించి మీకు ఈ విషయాలు తెలుసా..? చెక్ చేసుకోండి
భారత త్రివర్ణ పతాకాన్ని తెలుగు వ్యక్తి, స్వాతంత్ర్య సమర యోధులు పింగళి వెంకయ్య రూపొందించారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. త్రివర్ణ పతాకం గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసో.. లేదో.. ఒకసారి చెక్ చేసుకోండి..
Indian National Flag Quiz: భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఆగస్టు 15, 2022తో 75 వసంతాలు పూర్తి కానున్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వం అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య దినోత్స వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ప్రతీ ఇంటిపై ఎగురవేయాలని పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా అందరికీ త్రివర్ణ పతాకం అందేలా చర్యలు సైతం తీసుకుంది. అయితే.. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్స వేడుకల్లో భాగంగా.. మేము మీకు కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాము.. భారత త్రివర్ణ పతాకాన్ని తెలుగు వ్యక్తి, స్వాతంత్ర్య సమర యోధులు పింగళి వెంకయ్య రూపొందించారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. త్రివర్ణ పతాకం గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసో.. లేదో.. ఒకసారి చెక్ చేసుకోండి..
జాతీయ జెండాను తొలిసారిగా ఎగురవేసిన సంవత్సరం ఏది?
- 1906
- 1945
- 1947
- 1912
కాషాయం రంగు దేనిని సూచిస్తుంది?
- ధైర్యం – నిస్వార్థత, బలానికి చిహ్నం
- బలం – ధైర్యం
- సెక్యులరిజం
- ఆనందం – విజయం
ఆకుపచ్చ రంగు దేనిని సూచిస్తుంది?
- దేశ సమృద్ధి, ఐశ్వర్యం, సాఫల్యతకు చిహ్నం.
- శౌర్యం, ధైర్యం
- పునరుద్ధరణ, పునరుత్థానం
- స్థిరత్వం,ఓర్పు
తెలుపు దేనిని సూచిస్తుంది?
- ప్రశాంతత
- ధైర్యం
- సత్యం, శాంతి, స్వచ్ఛతకు చిహ్నం
- స్వచ్ఛత – అమాయకత్వం
అశోక చక్రంలో ఎన్ని ఆకులు (స్పోక్స్) ఉన్నాయి?
- 21
- 22
- 23
- 24
జెండా వెడల్పు-పొడవు ఎంత నిష్పత్తిలో ఉండాలి?
- 2:2
- 3:2
- 1:3
- 9:6
భారత జెండాను తొలిసారిగా అంతరిక్షంలోకి తీసుకెళ్లిన వ్యోమగామి ఎవరు?
- సునీతా విలియమ్స్
- కల్పనా చావ్లా
- రాకేష్ శర్మ
- శిరీష బండ్ల
ఎవరెస్ట్ పర్వతంపై జెండాను ఎప్పుడు ఎగురవేశారు?
- 1948
- 1952
- 1953
- 1962
ఫ్లాగ్ కోడ్‌ను ఏ సంవత్సరంలో సవరించారు..?
- 1962
- 1974
- 2002
- 2008
భారతదేశపు అతిపెద్ద మానవ జెండా ప్రదర్శనలో ఎంతమంది వాలంటీర్లు పాల్గొన్నారు..?
- 25,000 మంది వాలంటర్లు
- 20,000 మంది వాలంటీర్లు
- 50,000 మంది వాలంటీర్లు
- 75,0000 మంది వాలంటీర్లు
సమాధానాలు.. 1-1, 2-2, 3-1, 4-3, 5-4, 6-2, 7-3, 8-3, 9-3, 10-3,
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..