Viral Video: భల్లే.. భల్లే.. కరెంట్ వైర్లపై ఖతర్నాక్ స్టెప్పులేసిన కోతి.. ఊయల ఊగుతూ.. వీడియో

వైరల్ అయ్యే ఫన్నీ వీడియోల్లో ఎక్కువగా.. కోతి, కుక్కలు, పిల్లులకు సంబంధించినవి ఉంటాయి. ఇవి నెటిజన్లను తెగ నవ్విస్తుంటాయి.

Viral Video: భల్లే.. భల్లే.. కరెంట్ వైర్లపై ఖతర్నాక్ స్టెప్పులేసిన కోతి.. ఊయల ఊగుతూ.. వీడియో
Monkey
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 04, 2022 | 9:20 AM

Monkey Enjoy Video: పలు జంతువులకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇవి చూడటానికి చాలా ఫన్నీగా.. ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే ఫన్నీ వీడియోల్లో ఎక్కువగా.. కోతి, కుక్కలు, పిల్లులకు సంబంధించినవి ఉంటాయి. ఇవి నెటిజన్లను తెగ నవ్విస్తుంటాయి. తాజాగా ఓ.. కోతికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. కోతులు చాలా సరదాగా ఉంటాయి. వాటి చర్యలు, జంప్‌లు ఎవరినైనా సంతోషపరుస్తాయి. కోతుల చేష్టలు చూస్తుంటే.. అచ్చం మనుషుల మాదిరిగానే అనిపిస్తుంది. తాజాగా ఒక కోతి కరెంట్ తీగలపై కూర్చొని… ఊయల ఊగుతూ.. తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించింది.

రెండు స్తంభాలకు వేలాడుతున్న విద్యుత్ తీగలపై కోతి కూర్చొని ఊయల ఊగుతూ.. ఆస్వాదిస్తుండటాన్ని వీడియోలో చూడవచ్చు. కోతి సరదాగా వైర్ మీద కూర్చొని.. చేతులతో రెండు వైర్లను పట్టుకుంది. ఈ సమయంలో కోతి ముందుకు, వెనుకకు ఊగుతూ ఎంజాయ్ చేస్తుండటాన్ని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వానరం వీడియో చూడండి.. 

ఈ వీడియోను @umda_panktiyan అనే యూజర్ ట్విట్టర్‌లో షేర్ చేయగా.. వేలాది మంది వీక్షించారు. ఇప్పటివరకు దీనిని 64 వేల మందికి పైగా వీక్షించి లైకులు కూడా చేశారు. దీంతోపాటు పలు రకాల ఫన్నీ రియాక్షన్స్ కూడా ఇస్తున్నారు. ఈ కోతిని చూస్తుంటే మనం కూడా ఇంత ఎంజాయ్ చేయం.. అద్భుతంగా ఊయల ఊగుతోంది అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..