AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkeypox Alert: అలాంటి వారికి ముప్పు తప్పదా..? డేంజర్ బెల్స్ మోగిస్తున్న మంకీపాక్స్.. నిపుణులు ఏమంటున్నారంటే..?

భారత్‌లో మంకీపాక్స్ మహమ్మారి కేసుల సంఖ్య 9కి చేరింది. ఇప్పటివరకు ఈ వ్యాధితో ఒకరు మరణించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు ప్రారంభించింది.

Monkeypox Alert: అలాంటి వారికి ముప్పు తప్పదా..? డేంజర్ బెల్స్ మోగిస్తున్న మంకీపాక్స్.. నిపుణులు ఏమంటున్నారంటే..?
Monkeypox
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 04, 2022 | 11:15 AM

Monkeypox cases in India: దేశంలో కరోనాతోపాటు మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా కేరళతోపాటు ఢిల్లీలో మంకీపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు భారత్‌లో మంకీపాక్స్ మహమ్మారి కేసుల సంఖ్య 9కి చేరింది. ఇప్పటివరకు ఈ వ్యాధితో ఒకరు మరణించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు ప్రారంభించింది. రాష్ట్రాల్లో సంక్రమణ వ్యాప్తిని తనిఖీ చేయడానికి సన్నాహాలను కూడా వేగవంతం చేసింది. రోగనిర్ధారణ, వ్యాక్సిన్‌ల అభివృద్ధిని పర్యవేక్షించేందుకు జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఆగస్టు 2న తెలిపారు . ICMR ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, పుణె అనుమానిత కేసులను పరీక్షించడానికి రిఫరల్ లాబొరేటరీగా నియమించినట్లు తెలిపారు. అదనంగా, 15 ఇతర ICMR-వైరల్ రీసెర్చ్, డయాగ్నస్టిక్ లాబొరేటరీ నెట్‌వర్క్ లేబొరేటరీలు మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను చేపట్టేందుకు ఆప్టిమైజ్ చేశారు.

కోవిడ్-19 వంటి ఇతర అంటు వ్యాధులతో పోలిస్తే మంకీపాక్స్ వైరస్ అంతగా వ్యాపించదని, మరణాల రేటు చాలా తక్కువగా ఉన్నందున, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు భరోసా కల్పిస్తున్నాయి. అయినప్పటికీ.. ఇంట్లో ఉన్న వృద్ధులు, వ్యాధిగ్రస్తులు ఆందోళన చెందుతున్నారు. సంక్రమణ వాటిని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలపై నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కన్సల్టెంట్ డాక్టర్ ఛవీ గుప్తా న్యూస్ 9తో ప్రత్యేకంగా మాట్లాడారు. మంకీపాక్స్ అనేది ఒక అంటు వ్యాధి కావున దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు (comorbidities) తీవ్రమైన ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని చెప్పారు.

ఇటీవల కేరళలో మరణించిన 22 ఏళ్ల యువకుడి గురించి ప్రస్తావిస్తూ.. ఆ యువకుడు మంకీపాక్స్ ఇన్‌ఫెక్షన్‌తో మరణించగా, అతనికి బ్రెయిన్ ఎన్సెఫాలిటిస్ కూడా ఉందని ఛవీ గుప్తా పేర్కొన్నారు. ‘‘రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులలో ఏదైనా వైరస్ తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. అందువల్ల క్యాన్సర్, మధుమేహం ఉన్నవారు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలి” అని డాక్టర్ గుప్తా చెప్పారు.

ఇవి కూడా చదవండి

సెకండరీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ..

కోమోర్బిడిటీలు (రోగాలు ఉన్న వారు) ఉన్న వ్యక్తులు మంకీపాక్స్ వైరస్‌తో కలిసి ఎన్సెఫాలిటిస్, న్యుమోనియా ఇన్ఫెక్షన్‌లను అభివృద్ధి చేయవచ్చని ఛవీ గుప్తా వివరించారు. “ఈ వ్యాధి మరింత తీవ్రమైన రూపంలో వ్యక్తమవుతుంది కావున ఈ వ్యక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి” అని డాక్టర్ గుప్తా సూచించారు.

రోగనిరోధక శక్తి లేని వ్యక్తికి అధిక జ్వరం, శరీరంపై దద్దుర్లు ఉండవచ్చు. రికవరీకి దీర్ఘకాలం పడుతుంది. “అయితే, ఈ వ్యక్తులు ద్వితీయ బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్‌ను పొందవచ్చు. మరో మాటలో చెప్పాలంటే మంకీపాక్స్ వైరస్‌తో, మరొక బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ చర్మ ఇన్‌ఫెక్షన్ల వలె అతిగా మారవచ్చు” అని డాక్టర్ గుప్తా హెచ్చరించారు.

కొమొర్బిడిటీలు ( దీర్ఘకాల వ్యాధులు) ఉన్నవారు లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గుప్తా సూచించారు. “వైరస్ సంక్రమణను సులభంగా గుర్తించవచ్చు – ప్రోడ్రోమల్ లక్షణాలు (జ్వరం, అనారోగ్యం, లెంఫాడెనోపతి, శ్వాసకోశ లక్షణాలు) దద్దుర్లు ఉంటాయి. ఎవరైనా ఈ లక్షణాలను కనుగొంటే.. అలాంటి వారు ఐసోలేషన్‌లో ఉండాలి. ఇంకా నిపుణుడిని సంప్రదించాలి లేదా వెంటనే ఆసుపత్రిని సందర్శించాలి. ఇది కొమొర్బిడ్ ప్రజలు, వృద్ధులలో సంక్రమణ వ్యాప్తిని నివారిస్తుంది” అని డాక్టర్ గుప్తా చెప్పారు.

Source Link

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి