Viral Video: వామ్మో.. వీడు మామూలోడు కాదు.. పులిని పిలిచి మరీ ఏం చేశాడో చూడండి.. షాకింగ్ వీడియో

సాధారణంగా క్రూర జంతువులకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అవి ఎప్పుడు దాడి చేస్తాయో అస్సలు ఊహించలేం.. ఇంకా పులి, సింహం లాంటి జంతువులైతే ఒక్క పంజాతోనే తమ ఆధీనంలోకి తీసుకుంటాయి.

Viral Video: వామ్మో.. వీడు మామూలోడు కాదు.. పులిని పిలిచి మరీ ఏం చేశాడో చూడండి.. షాకింగ్ వీడియో
Tiger Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 04, 2022 | 12:36 PM

Tiger Viral Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాలు వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా.. నేషనల్ జూ పార్క్‌లో ఓ బస్సు డ్రైవర్‌, పులికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. సాధారణంగా క్రూర జంతువులకు దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అవి ఎప్పుడు దాడి చేస్తాయో అస్సలు ఊహించలేం.. ఇంకా పులి, సింహం లాంటి జంతువులైతే ఒక్క పంజాతోనే తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. తాజాగా.. ఓ బస్సు డ్రైవర్.. పులిని చూసి మరి బస్సును ఆపాడు.. ఆపై పులి దగ్గరకు రాగానే కిటికీ తెరిచి దానికి మాంసం ముక్కను తినిపించాడు.. ఈ షాకింగ్ వీడియో చూసి సోషల్ మీడియా యూజర్లు ఖంగుతింటున్నారు. బస్సు డ్రైవర్ పని ప్రాణాంతకంగా ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. చాలా మంది నెటిజన్లు డ్రైవర్‌ ఫూల్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు గుండెలు తీసిన బంటు అంటూ పేర్కొంటుననారు.

వైరల్ అవుతున్న వీడియోలో డ్రైవర్ బస్సు కిటికీ తెరిచి పులికి మాంసం ముక్క తినిపించడానికి ప్రయత్నిస్తుండాన్ని చూడవచ్చు. ఒక చేత్తో కెమెరా పట్టుకుని ఉన్నాడు. మరో చేతిలో ముక్కను పట్టుకోని ఉన్నాడు. మాంసం ముక్కను చూసి దగ్గరకు వచ్చి పులి.. తలని కిటికీ లోపలికి పెడుతుంది. అనంతరం మాంసం ముక్కను తింటుంది. అదృష్టం ఏంటంటే.. పులి డ్రైవర్‌కు ఎలాంటి హాని కలిగించదు. పులిని చూస్తుంటే ఒక్క పంజాతో చంపేలా కనిపిస్తుంది. డ్రైవర్ చేసిన ఈ పనిని నెటిజన్లు మూర్ఖత్వంగా అభివర్ణిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

పులి, బస్సు డ్రైవర్ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో the_amazing_tigers అనే యూజర్ షేర్ చేయగా.. వేలాది మంది వీక్షించి లైకులు చేస్తున్నారు. దీంతోపాటు పలురకాల కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సరదా చర్యలు ప్రాణాలను తీస్తాయంటూ హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..