AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vice President: భారత తదుపరి ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ కర్.. ప్రత్యర్థి మార్గరెట్ అల్వా పై విజయం

సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జగదీప్‌ ధన్‌కర్‌ (Jagdeep Dhnkar) భారత కొత్త ఉపరాష్ట్రపతిగా (Vice President) బాధ్యతలు చేపట్టబోతున్నారు. పశ్చిమ బంగ గవర్నర్‌గా పనిచేసిన 71 ఏళ్ల ధన్‌కర్‌ రాజ్యసభ ఛైర్మన్‌ పదవిలోనూ సత్తా చాటబోతున్నారు....

Vice President: భారత తదుపరి ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్ కర్.. ప్రత్యర్థి మార్గరెట్ అల్వా పై విజయం
Jagdeep Dhankhar
Ganesh Mudavath
|

Updated on: Aug 06, 2022 | 8:05 PM

Share

సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జగదీప్‌ ధన్‌కర్‌ (Jagdeep Dhnkar) భారత కొత్త ఉపరాష్ట్రపతిగా (Vice President) బాధ్యతలు చేపట్టబోతున్నారు. పశ్చిమ బంగ గవర్నర్‌గా పనిచేసిన 71 ఏళ్ల ధన్‌కర్‌ రాజ్యసభ ఛైర్మన్‌ పదవిలోనూ సత్తా చాటబోతున్నారు. వెంకయ్యనాయుడి స్థానంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వహింబోతున్నారు. 71 ఏళ్ల జగదీప్‌ ధన్‌కర్‌ స్వస్థలం రాజస్థాన్‌ లోని కితానా గ్రామం. మే 18, 1951న జన్మించారు. భారత 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు జగ్‌దీప్‌ ధన్‌కర్‌. గోకల్‌చంద్‌, కేసరి దేవి దంపతులకు ఆయన జన్మించారు. ప్రాథమిక విద్యను కితానా గ్రామంలోనే పూర్తి చేశారు. అనంతరం చితోర్‌ఘర్‌ సైనిక స్కూళ్లో చదివారు. రాజస్థాన్‌ యూనివర్సీటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. సుదేశ్‌ ధన్‌కర్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తే ఉన్నారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు జగ్‌దీప్‌ ధన్‌కర్‌ కు పలు రంగాలపై పట్టుంది. రాజకీయాలతో పాటు లాయర్‌గా, క్రీడాకారుడిగానూ రాణించారు. గతంలో సుప్రీంకోర్టు అడ్వొకేట్‌గా పనిచేశారు.

జగ్‌దీప్‌ ధన్‌కర్‌. సట్లెజ్‌ నదీజలాల వివాదంలో హర్యానా ప్రభుత్వం తరపున వాదించి ఫేమస్‌ అయ్యారు. 1989-91 మధ్య జున్‌జున్‌ నియోజక వర్గం నుంచి జనతాదళ్ పార్టీ తరఫున ఎంపీగా విధులు నిర్వహించారు. రాజస్థాన్‌ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యరు. రాజస్థాన్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. రాజస్థాన్‌ లోని కిషన్‌గంజ్‌ నుంచి 1993-98 మధ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1990లో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. లోక్‌సభతో పాటు రాజస్థాన్‌ అసెంబ్లీలో వివిధ కమిటీలో పనిచేశారు. క్రీడలంటే కూడా ఆయనకు చాలా ఆసక్తి. రాజస్థాన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌, రాజస్థాన్‌ టెన్నీస్‌ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 నుంచి బెంగాల్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

జులై 20, 2019 న కేంద్రం బెంగాల్‌ గవర్నర్‌గా నియమించింది. బెంగాల్‌ గవర్నర్‌గా జగదీప్‌ ధన్‌కర్‌ శైలి బీజేపీ నేతలను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సీఎం మమతను ఆయన ఎదుర్కొన్న తీరుపై ప్రధాని మోదీ, అమిత్‌షా పలుమార్లు ప్రశంసించినట్టు తెలుస్తోంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కొద్దిరోజుల ముందే దీదీతో ధన్‌కర్‌ మెరుగుపర్చుకోవడం ఆయన వినూత్న రాజకీయ శైలికి నిదర్శనం. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన యశ్వంత్‌సిన్హాను అభ్యర్ధిగా నిలబెట్టిన మమత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మాత్రం దూరంగా ఉన్నారు. టీఎంసీ ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. పరోక్షంగా మమత కూడా ధన్‌కర్‌కు మద్దతిచ్చినట్టు అర్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి

రాజ్యసభను నడిపించడంలో వెంకయ్యనాయుడు పెద్దరికాన్ని చాటుకున్నారు. ఆయన స్థానాన్ని ధన్‌కర్‌ సమర్ధవంతంగా భర్తీ చేస్తారని అధికార పక్షం భావిస్తోంది. అందుకే కీలకమైన రాజ్యసభ ఛైర్మన్‌ పదవిని ఆయన కట్టబెడుతున్నారు.