గుడి గంటలు గణగణ ! జూన్ 1 నుంచి అయోధ్యలో మళ్ళీ తెరుచుకోనున్న ఆలయాలు, భక్తులకు పూజారుల ‘మార్గదర్శకాలు’
దేశంలో కోవిద్ కేసులు తగ్గుముఖం పట్టినందున జూన్ 1 నుంచి అయోధ్యలోని ఆలయాలు మళ్ళీ తెరచుకోనున్నాయి. ఇక్కడి ప్రధాన ఆలయాలను తిరిగి ప్రారంభించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది.
దేశంలో కోవిద్ కేసులు తగ్గుముఖం పట్టినందున జూన్ 1 నుంచి అయోధ్యలోని ఆలయాలు మళ్ళీ తెరచుకోనున్నాయి. ఇక్కడి ప్రధాన ఆలయాలను తిరిగి ప్రారంభించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దర్శనం కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిద్ గైడ్ లైన్స్ పాటించాలని పూజారులు, సంత్ లు కోరుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న తరువాతే రావాలని, మాస్క్ ధారణ తప్పనిసరని, ఆలయంలో ప్రవేశించే ముందు చేతులను శానిటైజ్ చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. గుడిలోకి ఒకేసారి కేవలం 5 గురు భక్తులను మాత్రం అనుమతించాలని అయోధ్య జిల్లా అధికారులు నిర్ణయించారు. ఒకప్పుడు యూపీలో కోవిద్ కేసులు పెరిగినప్పుడు గత శ్రీరామనవమి నుంచి అన్ని ఆలయాలను మూసివేశారు. అయితే పరిస్థితి చాలావరకు మెరుగు పడినందున భక్తులు అన్ని జాగ్రత్తలు తీసుకుని రావాలని హనుమాన్ గర్హి పూజారి రాజుదాస్ విజ్ఞప్తి చేశారు. ఆలిండియా వైష్ణవ్ అఖారా పరిషద్ అధికార [ప్రతినిధి అయిన మహంత్ గౌరీ శంకర్ దాస్ కూడా ఆయనతో ఏకీభవించారు.
కోవిద్ పాండమిక్ కారణంగా వేలాది భక్తులు ఆలయాలకు రాలేకపోయారని, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడంతో బాటు అన్ని జాగ్రత్తలతో రావచ్చునని ఆయన చెప్పారు. కాగా ఉత్తరప్రదేశ్ లో నిన్న 56 జిల్లాల్లో ఆంక్షలను సడలించగా నేడు మరో నాలుగు జిల్లాల్లో వీటిని సడలించారు. రాబోయే రోజుల్లో మరికొన్ని జిల్లాల్లో కూడా సడలించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే లక్నో వంటి కొన్ని నగరాల్లో ఇంకా కోవిద్ కేసులున్నందున ప్రస్తుతానికి ఈ సిటీల్లో ఆంక్షలు యధాతధంగా అమల్లో ఉంటాయి.
మరిన్ని ఇక్కడ హూదండి: CM Jagan: జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా.. కోర్టులో వాదనలు ఇలా ఉన్నాయి