Weight Loss Foods : బరువు తగ్గాలంటే డైట్‌లో ఈ మూడు తప్పనిసరి..! ట్రై చేసి చూడండి బెల్లీ ఫ్యాట్‌ని కరిగించండి..

Weight Loss Foods : దైనందిన జీవితంలో సమయ పాలన లేని తిండి వల్ల ఊబకాయం వస్తోంది. దీనివల్ల విపరీతమైన

Weight Loss Foods : బరువు తగ్గాలంటే డైట్‌లో ఈ మూడు తప్పనిసరి..! ట్రై చేసి చూడండి బెల్లీ ఫ్యాట్‌ని కరిగించండి..
Weight Loss Foods
Follow us
uppula Raju

|

Updated on: Jun 01, 2021 | 12:06 PM

Weight Loss Foods : దైనందిన జీవితంలో సమయ పాలన లేని తిండి వల్ల ఊబకాయం వస్తోంది. దీనివల్ల విపరీతమైన బరువు పెరుగుతున్నారు. శారీరక శ్రమలేకపోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడం లేదు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఊబకాయం ఉన్నవారు అనేక వ్యాధుల బారిన పడుతున్నారని వైద్యన నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, స్లిమ్‌గా ఉండటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సులువుగా బరువు ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నిమ్మకాయ తీసుకోవడం మీరు బరువు తగ్గాలనుకుంటే ఊబకాయం సమస్యను నివారించాలనుకుంటే నిమ్మకాయను కచ్చితంగా వాడాలి. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఇది బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. జీర్ణ సమస్యలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇది ఊబకాయం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే నిమ్మకాయలోని కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది.

2. యాలకుల వినియోగం మీరు కొవ్వు తగ్గించాలనుకుంటే యాలకులు మీకు సహాయపడతాయి. యాలకులు తినడం ద్వారా మీకు భారంగా అనిపించదు. అజీర్ణం అనిపించదు. యాలకులు జీవక్రియను పెంచుతాయి. ఇది బరువు తగ్గడం సులభం చేస్తుంది.

3. దాల్చినచెక్క తీసుకోవడం దాల్చినచెక్క సహాయంతో మీరు చాలా వరకు బరువు తగ్గవచ్చు. ఇది చాలా ఔషధ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది కానీ జీవక్రియను మెరుగుపరచడంలో ప్రభావం చూపదు. ప్రత్యేక విషయం ఏమిటంటే ఆహార కోరికలను నియంత్రించడంతో పాటు, ప్రజలు అతిగా తినకుండా నిరోధిస్తుంది.

Xiaomi Hyper Charge: సరికొత్త టెక్నాలజీతో షియోమి ఫాస్ట్‌ చార్జర్స్‌.. కేవలం 8 నిమిషాల్లోనే ఫుల్‌ చార్జింగ్‌

మయన్మార్ తరహా సైనిక కుట్ర అమెరికాలోనూ జరిగితే మేలు, మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్ వివాదాస్పద వ్యాఖ్య

Sonu Sood : ‘నేను కాదు.. సోనూసూద్ సూపర్ హీరో’.. అతనికి థ్యాంక్స్ చెప్పమన్న కేటీఆర్.. ట్విట్టర్ వేదికగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ