AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మయన్మార్ తరహా సైనిక కుట్ర అమెరికాలోనూ జరిగితే మేలు, మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్ వివాదాస్పద వ్యాఖ్య

అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఇప్పటికీ ఇంకా యాక్టివ్ గానే ఉన్నారు. ఆయనకు ఏదోవిధంగా తిరిగి దేశాధ్యక్ష పదవి దక్కుతుందని గంపెడాశతో ఉన్నారు.

మయన్మార్ తరహా సైనిక కుట్ర అమెరికాలోనూ జరిగితే మేలు,  మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్ వివాదాస్పద వ్యాఖ్య
Security Adviser Michael Flynn
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jun 01, 2021 | 11:56 AM

Share

అమెరికాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ఇప్పటికీ ఇంకా యాక్టివ్ గానే ఉన్నారు. ఆయనకు ఏదోవిధంగా తిరిగి దేశాధ్యక్ష పదవి దక్కుతుందని గంపెడాశతో ఉన్నారు. మయన్మార్ లో జరిగిన సైనిక కుట్ర వంటిది ఇక్కడ కూడా జరగాలని వారు కోరుకుంటున్నారు.ఇలాంటి వారిలో మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్ ఒకరు. అమెరికాలోనూ మయన్మార్ తరహా ఘటన పునరావృతమవ్వాలని ఆయన అంటున్నారు. ఆ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టి సైనికులు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. గత ఫిబ్రవరి 1 న దేశ నేత ఆంగ్ సాన్ సూకీని అదుపులోకి తీసుకుని కుట్ర పూరితంగా అధికార పగ్గాలను సైనిక ప్రభుత్వం చేబట్టింది. ఆ పరిణామాలను ట్రంప్ కు మద్దతు తెలుపుతున్న ఆన్ లైన్ ఫోరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. అలాంటి కుట్రే ఇక్కడ కూడా జరిగిన పక్షంలో ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడవుతారని మైఖేల్ ఫ్లిన్ అంటున్నారు. ‘ఫర్ గాడ్ అండ్ కంట్రీ పేట్రియాట్ రౌండప్’ పేరిట టెక్సాస్ లో ఈ ఫోరాల సభ్యులు నిర్వహించిన ఈవెంట్ లో పాల్గొన్న ఆయన.. ఆ శుభ పరిణామం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. బహుశా అందుకు ఎంతో కాలం పట్టకపోవచ్చు అని వ్యాఖ్యానించారు. గతవారం నిర్వహించిన ఓ ఈవెంట్ లో కూడా ఈయన ..ఇంకా ట్రంప్ అధికారంలో ఉన్నట్టే మాట్లాడారు. ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచారని, ఎలెక్టోరల్ కాలేజీ ఓట్లలో అత్యధిక ఓట్లను సాధించారని పేర్కొన్నారు.

అయితే తెరవెనుక ఉండి ట్రంపే ఇదంతా చేయిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాలిఫోర్నియాలో ఉంటున్న ఆయన తన సపోర్టర్లతో ఈ విధమైన కార్యక్రమాలను నిర్వహించేలా వారిని ప్రోత్సహిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా ఈ విధమైన ఈవెంట్లను అధ్యక్షుడు జోబైడెన్ వర్గం కొట్టిపారేస్తోంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Buy Now Pay Later: కరోనా కాలంలో బై నౌ, పే లేటర్‌ స్కీమ్‌ల వైపు మొగ్గు చూపుతున్న కస్టమర్లు..!

MIS-C Disease : తల్లిదండ్రులు జాగ్రత్త..! కరోనా సోకిన పిల్లలకు మరో వింతవ్యాధి..? లక్షణాలు ఇలా ఉంటున్నాయి..