AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్ని కుక్కను రక్షించుకునేందుకు ఆ చిన్నారి ఏం చేశాడంటే ? సీన్ కట్ ! చలించిన పోకెమాన్ కంపెనీ

అమెరికాలో ఎనిమిదేళ్ల చిన్నారి తాను ఇష్టంగా పెంచుకుంటున్న బ్రూస్ అనే కుక్కపిల్లను రక్షించుకునేందుకు తన చిన్ని చేతులతో ' ఓ అమ్మకందారుడే' అయ్యాడు.

చిన్ని కుక్కను రక్షించుకునేందుకు ఆ చిన్నారి ఏం చేశాడంటే ?  సీన్ కట్ !  చలించిన పోకెమాన్ కంపెనీ
Pokemon Company Sends Special Gift
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 01, 2021 | 2:31 PM

Share

అమెరికాలో ఎనిమిదేళ్ల చిన్నారి తాను ఇష్టంగా పెంచుకుంటున్న బ్రూస్ అనే కుక్కపిల్లను రక్షించుకునేందుకు తన చిన్ని చేతులతో ‘ ఓ అమ్మకందారుడే’ అయ్యాడు. గుర్తు తెలియని వైరస్ తో బాధ పడుతున్న కుక్కకు తక్షణ వైద్యం అవసరమని, జాప్యం చేయరాదని పశువైద్య నిపుణులు చెబితే అందుకు అయ్యే ఖర్చు తెలిసి ఆ చిన్నారి కన్నీటి పర్యంతమయ్యాడు. కనీసం 700 డాలర్ల వ్యయమవుతుందని వాళ్ళు చెప్పడంతో ఆ పేద కుర్రాడితో బాటు వాడి పేరెంట్స్ కూడా విచారంలో మునిగిపోయారు. చివరకు తనదగ్గరున్న పోకేమాన్ కార్డులను అమ్మి అలా వచ్చిన సొమ్ముతో తన డాగ్ ని రక్షించాలనుకున్నాడు బ్రైసన్ క్లీమన్ అనే ఆ కుర్రాడు. వెంటనే తన ఇంటిముందే ఈ కార్డులను అమ్ముతానంటూ ఓ కుర్చీ వేసుకుని బోర్డు పెట్టాడు. ఇతని తల్లి కూడా ‘గో ఫండ్ మీ’ అనే పేజ్ తో విరాళాల సేకరణకు నడుం కట్టింది. మొదట ఈ పేజ్ ద్వారా కేవలం, 800 డాలర్ల డొనేషన్ మాత్రమే అందగా ఆ తరువాత అది 55 వేల 490 డాలర్లకు పెరిగిపోవడంతో ఆ కుటుంబం ఆనందానికి అంతే లేకపోయింది. ఇక ఆ చిన్ని కుక్కకు వైద్య చికిత్స చేయించారని వేరే చెప్పాలా

కథ ఇక్కడితో ముగియలేదు. ఈ చిన్నారి ఉదంతం తెలిసి బెలూవే లోని పోకెమాన్ ప్రధాన కార్యాలయ అధికారులు అతనికి తమవద్ద ఉన్న అత్యంత అరుదైన పోకెమాన్ కార్డులను గిఫ్ట్ గా అందించారు. అవసరమైతే నీకు ఇంకా సాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Justice Arun Mishra: జాతీయ మానవ హక్కుల కమిషన్ కొత్త చైర్మన్ ఎంపిక కసరత్తు పూర్తి.. జస్టిస్ అరుణ్ మిశ్రా పేరు దాదాపు ఖరారు..!

Covid 19: థర్డ్ వేవ్ పై స్పందించిన హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో తెలపాలంటూ ఆదేశాలు

నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..