వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ కోసం ‘వేట’ మొదలు, డొమినికాకు వెళ్లిన 8 మంది భారత దర్యాప్తు సంస్థల బృందం, ఇండియాకు తీసుకువస్తారా ? లేక….?
వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ని ఇండియాకు తీసుకువచ్చేందుకు 8 మంది సభ్యులతో కూడిన 'మల్టీ ఏజెన్సీ' బృందం డొమినికాకు వెళ్ళింది. ఈ బృంద సభ్యులు గత శుక్రవారం డొమినికా చేరారు. తన నిర్బంధాన్ని సవాలు చేస్తూ...
వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ని ఇండియాకు తీసుకువచ్చేందుకు 8 మంది సభ్యులతో కూడిన ‘మల్టీ ఏజెన్సీ’ బృందం డొమినికాకు వెళ్ళింది. ఈ బృంద సభ్యులు గత శుక్రవారం డొమినికా చేరారు. తన నిర్బంధాన్ని సవాలు చేస్తూ చోక్సీ అక్కడి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. ఈ సందర్బంగా ఈ సభ్యులు కూడా అక్కడి పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సహకరిస్తారు. వీరిలో సీబీఐ నుంచి, ఈడీ నుంచి, సీఆర్పీ ఎఫ్ నుంచి ఇద్దరేసి సభ్యుల చొప్పున ఉన్నారు. ఈ కేసును ‘మిషన్ చోక్సీ’ గా వ్యవహరిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకును చోక్సీ ,ఆయన బంధువు నీరవ్ మోడీ రూ. 13,500 కోట్ల మేర ఛీట్ చేసిన నేపథ్యంలో సీబీఐ లోని బ్యాంక్ ఫ్రాడ్ విభాగం చీఫ్ అయిన శారదా రౌత్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. ఇదే బృందం తమతో బాటు మెహుల్ చోక్సీని ఇండియాకు తెస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. అంతా అనుకున్నట్టు జరిగితే అందుకు అవకాశాలున్నాయి. ఈ బృందం ఖతార్ నుంచి డొమినికాకు ప్రత్యేక జెట్ విమానంలో వెళ్ళింది. చోక్సీని ఇండియాకు తీసుకురాగానే ఢిల్లీ విమానాశ్రయంలోనే ఆయనను అరెస్టు చేయవచ్చునంటున్నారు. అయితే ఆయన తరఫు లాయర్ మాత్రం ఆ ఛాన్సే లేదంటున్నారు. తన క్లయింటు ఇప్పుడు భారత పౌరుడే కాదని, ఆయన ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నాడని వాదిస్తున్నారు.
మరోవైపు డొమినికాలోని ప్రతిపక్ష నేత లెమాక్స్ లింటన్…తమ ప్రధాని రూజ్ వెల్ట్ స్కెరిటీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. చోక్సీ వ్యవహారంలో జరిగిన కుట్రలో ఆయన పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపిస్తున్నారు మొత్తానికి డొమినికా. ఆంటిగ్వా ల మధ్య చోక్సీ వివాదాస్పద రాజకీయ ‘గురుడే’ అయ్యాడు.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : ఓనర్స్ పనితో షాక్‌తిన్న కుక్కపిల్ల…నవ్వులే నవ్వులే ..వైరల్ అవుతున్న వీడియో : Dog funny video viral.
యూపీలో అనాముషం..డెడ్ బాడీ నదిలో పడేస్తూ వీడియోకు పోజులు ఇచ్చిన యువకులు: vial video.