CM Jagan: జగన్ బెయిల్ రద్దు పిటిషన్​పై విచారణ వాయిదా.. కోర్టులో వాద‌న‌లు ఇలా ఉన్నాయి

జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణ జరిగింది. జగన్ తరపు లాయర్లు 98 పేజీల కౌంటర్....

CM Jagan: జగన్ బెయిల్ రద్దు పిటిషన్​పై విచారణ వాయిదా.. కోర్టులో వాద‌న‌లు ఇలా ఉన్నాయి
Cm Jagan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 01, 2021 | 12:18 PM

జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై సీబీఐ న్యాయస్థానంలో విచారణ జరిగింది. గ‌తంలో కోర్టు ఆదేశాల మేర‌కు జగన్ తరపు లాయర్లు 98 పేజీల కౌంటర్ దాఖలు చేశారు. జగన్ బెయిల్ షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని అందులో పేర్కోన్నారు. సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలో నిజం లేదని పేర్కొన్నారు. సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుందని.. పిటిషనర్ రఘురామరాజుకు ఈ కేసులో సంబంధం లేదని వివ‌రించారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని స్ప‌ష్టం చేశారు. రఘరామరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఆయ‌న‌ను అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్‍కు లేఖ కూడా రాసిన‌ట్లు వెల్ల‌డించారు. రఘురామ పిటిషన్‌కు విచారణార్హత లేదని.. వ్యక్తిగత, రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన పిటిషన్‌ను కొట్టివేయాలని సీబీఐ కోర్టును కోరారు. రఘురామరాజుపై ఏపీలో అనేక కేసులున్నాయని.. విన్న‌వించారు.

మరోవైపు సీబీఐ కూడా న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. రఘురామ పిటిషన్‌పై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరింది. వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది.

Also Read: గర్భంతో ఉన్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఊహించ‌ని విషాదం.. దంపతుల దుర్మ‌ర‌ణం

 లారీ బ్రేక్ ఫెయిల్.. రివర్స్ గేరులో 3 కిమీలు వెనక్కి.. చివ‌ర‌కు ఏం జరిగిందంటే