AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar City: సూర్యవంశజుడు రామయ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. విద్యుత్ కాంతులను ప్రసరింప జేయనున్న భానుడు

ఆలయ పట్టణాన్ని సౌరశక్తితో విద్యుదీకరించే పనులను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ.. అయోధ్యని రాజధానిగా చేసుకుని సూర్యవంశ రాజులు పరిపాలించారని.. కనుక అయోధ్యలో విద్యుత్తును ఇతర వనరుల నుండి కాకుండా సౌరశక్తి నుండి వస్తుంది" అని అన్నారు. సరయూ నది ఒడ్డున సోలార్ పార్కును అభివృద్ధి చేయడం, సౌరశక్తితో నడిచే పడవలను అందించడం, సోలార్ వీధిలైట్లను ఏర్పాటు చేయడం, ప్రజా రవాణాలో భాగంగా సౌరశక్తి తో నడిచే వాహనాలు, బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు వంటివి ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి.

Solar City: సూర్యవంశజుడు రామయ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. విద్యుత్ కాంతులను ప్రసరింప జేయనున్న భానుడు
Solar City Ayodhya
Surya Kala
|

Updated on: Oct 09, 2023 | 1:24 PM

Share

జనవరిలో జరిగే రామ మందిర ప్రతిష్ఠాపన వేడుకకు ఓ వైపుగా ఏర్పాట్లు చేస్తూనే మరో వైపు అయోధ్యను ఉత్తరప్రదేశ్‌లోని మొదటి “సోలార్ సిటీ”గా అభివృద్ధి చేసేందుకు యుద్ధప్రాతిపదికన పనులను చేస్తున్నారు.  ఉత్తరప్రదేశ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ టెంపుల్ టౌన్‌ను రాష్ట్రంలోని మొదటి “సోలార్ సిటీ”గా అభివృద్ధి చేయడానికి ఇప్పటికే పనులు చేపట్టిందని అధికారులు తెలిపారు. 2023 జనవరి 22న జరగనున్న “ప్రాణ ప్రతిష్ఠ” కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశ వ్యాప్తంగా దాదాపు 10,000 మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని రామాలయ నిర్మాణ కమిటీ చైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా ఇప్పటికే తెలిపారు. ఈ మేరకు అయోధ్యలో జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అధికారులు తెలిపారు.

సూర్యవంశస్థుల రాజధాని అయోధ్య

ఆలయ పట్టణాన్ని సౌరశక్తితో విద్యుదీకరించే పనులను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ.. అయోధ్యని రాజధానిగా చేసుకుని సూర్యవంశ రాజులు పరిపాలించారని.. కనుక అయోధ్యలో విద్యుత్తును ఇతర వనరుల నుండి కాకుండా సౌరశక్తి నుండి వస్తుంది” అని అన్నారు.

సౌర విద్యుత్ అందించేందుకు ప్రణాళిక

సరయూ నది ఒడ్డున సోలార్ పార్కును అభివృద్ధి చేయడం, సౌరశక్తితో నడిచే పడవలను అందించడం, సోలార్ వీధిలైట్లను ఏర్పాటు చేయడం, ప్రజా రవాణాలో భాగంగా సౌరశక్తి తో నడిచే వాహనాలు, బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు వంటి సౌరశక్తితో నడిచే సౌకర్యాలతో పాటు.. నగర విద్యుద్దీకరణ వంటివి ఈ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు, గృహావసరాల కోసం విద్యుత్ ను కూడా సౌరశక్తిని ఉపయోగించే ఇవ్వనున్నారు.

ఇవి కూడా చదవండి

సోలార్ సిటీ ప్రాజెక్ట్‌కు మోడల్ గా అయోధ్య

ఈ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రతిష్టాత్మక సోలార్ ఎనర్జీ పాలసీ 2022లో భాగమని సీనియర్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. 16 మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు నోయిడాను “సౌర నగరాలు”గా అభివృద్ధి చేయడం ఈ ప్రణాళికలోని ముఖ్యమైన అంశాలిని పేర్కొన్నారు. “సోలార్ సిటీ ప్రాజెక్ట్‌కు మోడల్ గా  అయోధ్యను ఎంపిక చేసి.. ముందుగా అభివృద్ధి చేయడం ద్వారా.. ఇతర ప్రతిపాదిత నగరాల్లో సోలార్ సిటీగా అభివృద్ధి చేయడం ప్రణాళికలో భాగమని UPNEDA డైరెక్టర్ అనుపమ్ శుక్లా PTI కి చెప్పారు.

సోలార్ సిటీ ప్రాజెక్ట్ ఐదేళ్ల ప్రణాళిక

సోలార్ సిటీ ప్రాజెక్ట్ ఐదేళ్ల ప్రణాళిక (2023-28)లో భాగంగా వీధిలైట్లు, ప్రభుత్వ భవనాల వద్ద సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, ఛార్జింగ్ స్టేషన్లతో కూడిన ఈ-రిక్షాలు, చెట్లకు నీరు అందించే విధానం,  తాగునీటి కోసం సౌరశక్తితో నడిచే ప్యూరిఫైయర్‌లు వంటి సౌకర్యాలు కల్పించడం వంటివి కూడా ఈ ప్రణాళికలో ఉన్నాయి. మొదటి దశలోనే వీటిని పూర్తి చేయనున్నామని తెలిపారు. అయోధ్యలో కొనసాగుతున్న చాలా ప్రాజెక్టులు జనవరి నాటికి పూర్తవుతాయని తాము విశ్వసిస్తున్నామని శుక్లా ధీమా వ్యక్తం చేశారు.

సరయూ ఒడ్డున 40 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ఎన్‌టిపిసి గ్రీన్ ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్ట్ లో అతిపెద్ద అంశమని జనవరి నాటికి 10 మెగావాట్ల విద్యుత్‌ను ప్రారంభించే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం భూమి ఖరారు రెడీ చేసినట్లు పనులు జరుగుతున్నాయని UPNEDA అధికారులు ధృవీకరించారు.

సోలార్ ఎనర్జీ పాలసీ ప్రకారం పునరుత్పాదక శక్తి ద్వారా 10 శాతం విద్యుత్ డిమాండ్‌ను తీర్చే ఏ నగరమైనా సోలార్ సిటీగా పరిగణించబడుతుంది. జనవరి నాటికి ప్రారంభ దశలో అయోధ్య ఈ లక్ష్యాన్ని చేరుకుంటుందని UPNEDA అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..