Telangana Assembly Election Date: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎప్పుడంటే..
Telangana Assembly Election Schedule: తెలంగాణ ఎన్నిక నగార మోగింది. ఎన్నికల తేదీలను ప్రకటించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. తెలంగాణలోని అన్ని స్థానాలకు ఒకే విడతలో నవంబరు 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో కలిపి డిసెంబరు 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నవంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ నవంబర్ 10. నవంబర్ 13న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. నామినేషన్ల స్వీకరణ వచ్చే నెల 3న మొదలవుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ నవంబర్ 10. నవంబర్ 13న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చివరి తేదీ నవంబర్ 15.
మొత్తంగా చూస్తే నవంబర్ 3న మొదలయ్యే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ డిసెంబర్ 3తో ముగియనుంది. అంటే 3, 30,3 తేదీలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల కోసం తెలంగాణలో 35,356 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేయనుంది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే రెండున్నర వేలు ఎక్కువ. తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 17 లక్షల 32 వేల 727. తెలంగాణలో మొదటిసారి ఓటు వేస్తున్న యువ ఓటర్ల సంఖ్య 5 లక్షల 32 వేల 990. తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ట్రాన్స్ జెండర్ ఓటర్ల సంఖ్య ఎక్కువుంది. తెలంగాణలో ప్రస్తుతం నమోదైన ట్రాన్స్‌జెండర్ ఓటర్ల సంఖ్య 2వేల 557. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం తెలంగాణలో దివ్యాంగ ఓటర్ల సంఖ్య 5 లక్షల 6 వేల 493.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కీలక తేదీలు ఇవే..
- నోటిఫికేషన్: నవంబర్ 3 2023.
- నామినేషన్ల స్వీకరణ: నవంబర్ 10 2023.
- నామినేషన్ల ఉపసంహరణ: నవంబర్ 15 2023.
- నామినేషన్ల పరిశీలన నవంబర్ 13 2023.
- పోలింగ్ తేదీ: నవంబర్ 30 2023.
- ఎన్నికల కౌంటింగ్: డిసెంబర్ 3 2023.
5 States Assembly polls | Chhattisgarh to vote on 7th Nov & 17th Nov; Madhya Pradesh on 17th Nov; Mizoram on 7th Nov, Rajasthan on 23rd Nov and Telangana on 30th Nov; Results on 3rd December pic.twitter.com/jV7TJJ9W4A
— ANI (@ANI) October 9, 2023
ఈ ఎన్నికల్లో ఓటర్లకు ఓటింగ్ స్లిపుల పంపిణీ అన్నది గతంలో మాదిరి పోలింగ్‌కు ఒకటి రెండు రోజుల ముందు కాకుండా కనీసం వారం ముందు అందించే ప్రయత్నం చేస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.
