AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ECI Assembly Election Dates Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎప్పుడంటే..

Election Commission Press Meet Updates: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో త్వరలో జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించింది. మొత్తం 40 రోజుల పాటు ఐదు రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల సన్నద్ధతను పరిశీలించామన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్... ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్‌ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.

ECI Assembly Election Dates Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎప్పుడంటే..
Election Commission Of India
Sanjay Kasula
|

Updated on: Oct 09, 2023 | 2:08 PM

Share

5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించారు. మీడియా సమావేశంలో ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఎంపీ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయని వెళ్లడించారు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని రాజీవ్ కుమార్ తెలిపారు.  తెలంగాణలో 3కోట్ల 17లక్షల ఓటర్లు ఉన్నారు. దీంతో పాటు తెలంగాణలో ప్రవర్తనా నియమావళి కూడా అమల్లోకి వచ్చింది.

నవంబర్‌ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్‌ 3న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది సీఈసీ. నవంబర్‌ 13న నామినేషన్ల పరిశీలన, నవంబర్‌ 15న నామినేషన్ల ఉపసంహరణ, డిసెంబర్‌ 3న తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించనున్నారు.

తెలంగాణ ఎన్నికల తేదీలు ఇలా..

  • నోటిఫికేషన్ తేదీ: నవంబరు 3
  • నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ: నవంబరు 10
  • నామినేషన్ల పరిశీలన తేదీ: నవంబరు 13
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబరు 15
  • పోలింగ్‌ తేదీ: నవంబరు 30
  • ఓట్ల లెక్కింపు తేదీ: డిసెంబరు 3

ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రాజస్థాన్‌లో 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 2.03 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. మిజోరంలో 8.25 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఈ రాష్ట్రాల్లో తొలిసారిగా ఓటు వేయనున్న 60.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

తెలంగాణలో జెండర్‌ రేషియో 998 ఉందన్నారు. మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. 5 రాష్ట్రాల్లో కొత్త ఓటర్ల సంఖ్య 60 లక్షలు ఉన్నారు. తెలంగాణలో 18-19 ఏళ్ల వయస్సు ఓటర్లు 3,35,043 ఉన్నారు. తెలంగాణలో కొత్త ఓటర్లు 17,01,087. తెలంగాణలో తొలగించిన ఓట్లు 6,10,694 వెల్లడించారు. తెలంగాణలో ఏర్పాటు చేసే పోలింగ్‌ కేంద్రాలు 36,366 ఉంటాయని ఈసీ తెలిపారు.

పదవీకాలం ఎప్పుడు ముగుస్తుందంటే..

మిజోరాం అసెంబ్లీ పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 17తో ముగియనుంది. ఇది కాకుండా తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం వచ్చే ఏడాది జనవరిలో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. తెలంగాణలో కేసీఆర్‌ పార్టీ బీఆర్‌ఎస్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, రాజస్థాన్‌-ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నాయి.

ఈసీ ఆదేశాల మేరకే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తారని రాజీవ్‌కుమార్‌ తెలిపారు.  VIGIL యాప్ ద్వారా ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును స్వీకరించిన తర్వాత, 100 నిమిషాల్లో చర్య తీసుకోబడుతుంది. 2 కిలోమీటర్ల పరిధిలో పోలింగ్ బూత్ ఉంటుంది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయదు. అక్టోబర్ 17 నాటికి ఓటరు జాబితా విడుదల చేస్తారు.

పోస్టల్ బ్యాలెట్ నిబంధనలలో మార్పులు..

5 రాష్ట్రాల్లో 940 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. అంతా పర్యవేక్షిస్తారు.. ఒక్కో చెక్‌పోస్టు వద్ద వేర్వేరు ఏజెన్సీలు ఉంటాయి. అన్ని ఏజెన్సీలు కలిసి పనిచేస్తాయి. మహిళా ఓటర్ల కోసం పోలింగ్ బూత్ వద్ద మహిళా సిబ్బంది ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ నిబంధనలలో మార్పులు చేశారు. పోస్ట్ పోల్ ఫిర్యాదు తర్వాత ఈ మార్పు జరిగింది.

సీనియర్ సిటిజన్లు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు

5 రాష్ట్రాల్లో 7.8 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 23.6 కొత్త మహిళా ఓటర్లు ఈసారి ఓటు వేయనున్నారు. ఎన్నికల సంఘం మొత్తం 5 రాష్ట్రాల్లో పర్యటించింది. పార్టీ ప్రతినిధులను కలిశాం. పోలింగ్ కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు. సీనియర్ సిటిజన్లు ఇంటి నుండే ఓటు వేయగలరు. 80 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 24.7 లక్షలు. ప్రతి పోలింగ్‌ బూత్‌ను కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షించనున్నారు. 1 లక్షా 77 వేల పోలింగ్ కేంద్రాలను నిర్మించనున్నారు. ఓటింగ్‌కు రెండు రోజుల ముందు ప్రచారం నిలిచిపోతుంది.

లైవ్ కోసం ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Oct 2023 01:48 PM (IST)

    కాంగ్రెస్‌, బీజేపీ… తమకు పోటీ కానే కాదు- మంత్రి గంగుల కమలాకర్‌

    కాంగ్రెస్‌, బీజేపీ… తమకు పోటీ కానే కాదంటున్నారు మంత్రి గంగుల కమలాకర్‌. సెకండ్‌ ప్లేస్‌ కోసమే కాంగ్రెస్‌, బీజేపీ పోటీపడుతున్నాయంటున్నారు. ప్రజల మధ్యనే ఉన్నాం, ప్రజలతోనే ఉన్నాం, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమంటున్నారు.

  • 09 Oct 2023 01:44 PM (IST)

    రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ.. -కేజ్రీవాల్

    ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు వెల్లడయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పూర్తి బలంతో పోటీ చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

  • 09 Oct 2023 01:42 PM (IST)

    అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం..

    అసెంబ్లీ ఎన్నికల తేదీలను EC ప్రకటించడాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వాగతించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ అత్యధిక మెజారిటీతో అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. రానున్న ఐదేళ్లపాటు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృతనిశ్చయంతో పని చేస్తాం.

  • 09 Oct 2023 01:01 PM (IST)

    సీనియర్ సిటిజన్లు ఇంటి నుంచే ఓటు వేయవచ్చు

    5 రాష్ట్రాల్లో 7.8 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 23.6 కొత్త మహిళా ఓటర్లు ఈసారి ఓటు వేయనున్నారు. ఎన్నికల సంఘం మొత్తం 5 రాష్ట్రాల్లో పర్యటించింది. పార్టీ ప్రతినిధులను కలిశాం. పోలింగ్ కేంద్రంలో అన్ని సౌకర్యాలు ఉంటాయన్నారు. సీనియర్ సిటిజన్లు ఇంటి నుండే ఓటు వేయగలరు. 80 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 24.7 లక్షలు. ప్రతి పోలింగ్‌ బూత్‌ను కంట్రోల్‌ రూం నుంచి పర్యవేక్షించనున్నారు. 1 లక్షా 77 వేల పోలింగ్ కేంద్రాలను నిర్మించనున్నారు. ఓటింగ్‌కు రెండు రోజుల ముందు ప్రచారం నిలిచిపోతుంది.

  • 09 Oct 2023 12:59 PM (IST)

    పోస్టల్ బ్యాలెట్ నిబంధనలలో మార్పులు..

    5 రాష్ట్రాల్లో 940 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. అంతా పర్యవేక్షిస్తారు.. ఒక్కో చెక్‌పోస్టు వద్ద వేర్వేరు ఏజెన్సీలు ఉంటాయి. అన్ని ఏజెన్సీలు కలిసి పనిచేస్తాయి. మహిళా ఓటర్ల కోసం పోలింగ్ బూత్ వద్ద మహిళా సిబ్బంది ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ నిబంధనలలో మార్పులు చేశారు. పోస్ట్ పోల్ ఫిర్యాదు తర్వాత ఈ మార్పు జరిగింది.

  • 09 Oct 2023 12:58 PM (IST)

    ఈ రెండు రాష్ట్రాల్లోనే అధిక మహిళా ఓటర్లు..

    ఐదు రాష్ట్రాల్లో ఓటర్ల వివరాలను ఈసీ ప్రకటించింది. వీటిలో రెండు రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. మిజోరంలో 4.13 లక్షల పురుష ఓటర్లు ఉండగా.. మహిళా ఓటర్లు 4.39 లక్షలు ఉన్నారు. చత్తీస్‌గడ్‌లో 1.01 కోట్ల పురుష ఓటర్లు ఉండగా.. మహిళా ఓటర్లు 1.02 కోట్లు ఉన్నారు.

  • 09 Oct 2023 12:57 PM (IST)

    అక్రమాలపై ఇలా ఫిర్యాదు చేయవచ్చు..

    ఈసీ ఆదేశాల మేరకే ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తారని రాజీవ్‌కుమార్‌ తెలిపారు. c మీరు VIGIL యాప్ ద్వారా ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును స్వీకరించిన తర్వాత, 100 నిమిషాల్లో చర్య తీసుకోబడుతుంది. 2 కిలోమీటర్ల పరిధిలో పోలింగ్ బూత్ ఉంటుంది. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయదు. అక్టోబర్ 17 నాటికి ఓటరు జాబితా విడుదల చేస్తారు.

  • 09 Oct 2023 12:57 PM (IST)

    తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలు ప్రకటించిన ఈసీ

    తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబరు 30న తెలంగాణ అసెంబ్లీకి పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబరు 3న నాలుగు రాష్ట్రాలతో కలిసి తెలంగాణకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి నవంబరు 7, 17 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనుండా.. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఒకే విడతలో నవంబరు 17న, మిజోరాం అసెంబ్లీకి ఒకే విడతలో నవంబరు 7న, రాజస్థాన్ అసెంబ్లీకి ఒకే విడతలో నవంబరు 23న పోలింగ్ నిర్వహిస్తారు.

    ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. కీలక తేదీలు..

  • 09 Oct 2023 12:53 PM (IST)

    పాయింట్లలో 5 రాష్ట్రాల ఎన్నికల తేదీలను చూడండి

    • తెలంగాణ- 30 నవంబర్ (రాష్ట్రంలో ఒక దశలో ఓటింగ్)
    • మిజోరం- నవంబర్ 7 (రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి)
    • ఛత్తీస్‌గఢ్- 7 నవంబర్ (రాష్ట్రంలో మొదటి దశ ఓటింగ్) మరియు 17 నవంబర్ (రాష్ట్రంలో రెండో దశ ఓటింగ్)
    • మధ్యప్రదేశ్-17 నవంబర్ (రాష్ట్రంలో ఒక దశలో ఓటింగ్)
    • రాజస్థాన్- 23 నవంబర్ (రాష్ట్రంలో ఒక దశలో ఓటింగ్)
    • డిసెంబర్ 3న అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
  • 09 Oct 2023 12:52 PM (IST)

    ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో పోలింగ్..

    ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో ఓటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇందులో మొదటి దశలో నవంబర్ 7న, రెండో దశకు నవంబర్ 17న పోలింగ్ జరగనుంది.

  • 09 Oct 2023 12:51 PM (IST)

    ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న విడుదల

    ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరం ఉన్నాయి.

  • 09 Oct 2023 12:51 PM (IST)

    తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్

    తెలంగాణలో నవంబర్ 30న, రాజస్థాన్‌లో నవంబర్ 23న ఓటింగ్ జరుగుతుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

  • 09 Oct 2023 12:50 PM (IST)

    5 రాష్ట్రాల్లో ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి..

    తెలంగాణలో – 3.17 కోట్ల మంది

    మధ్యప్రదేశ్ – 5.6 కోట్ల మంది ఓటర్లు

    రాజస్థాన్ – 5.25 కోట్ల మంది

    ఛతీస్‌గడ్ – 2.03 కోట్లు

    మిజోరాం – 8.52 లక్షల మంది

    మొత్తంగా ఈ ఐదు రాష్ట్రాల్లో 16.14 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

  • 09 Oct 2023 12:47 PM (IST)

    రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్..

    అక్టోబర్ 30న నోటిఫికేషన్ విడుదల..

    నామినేషన్ల దాఖలు చివరి తేదీ – నవంబర్ 6

    నామినేషన్ల స్క్రూటినీ – నవంబర్ 7

    నామినేషన్ల విత్ డ్రా – నవంబర్ 9

    ఎన్నికలు జరిగే తేదీ – నవంబర్ 23

    కౌంటింగ్ తేదీ – డిసెంబర్ 3

  • 09 Oct 2023 12:45 PM (IST)

    రెండో దశ పోలింగ్ కూడా అదే రోజు..

    మిజోరంలో ముందుగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 7న మిజోరాంలో ఓటింగ్ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌ తొలి దశ ఎన్నికలు కూడా నవంబర్‌ 7న జరగనున్నాయి. ఇది కాకుండా మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న ఓటింగ్ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశ పోలింగ్ కూడా అదే రోజు జరగనుంది.

  • 09 Oct 2023 12:45 PM (IST)

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్..

    నోటిఫికేషన్ – నవంబర్ 3

    నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ – నవంబర్ 10

    నామినేషన్ల పరిశీలన – నవంబర్ 13

    నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ – నవంబర్ 15

    పోలింగ్ – నవంబర్ 30

    ఓట్ల లెక్కింపు – డిసెంబర్ 03

  • 09 Oct 2023 12:45 PM (IST)

    రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య ఎంతంటే.?

    • తెలంగాణలో జెండర్‌ రేషియో 998
    • మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య అధికం
    • ఈ ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం
    • 5 రాష్ట్రాల్లో కొత్త ఓటర్ల సంఖ్య 60 లక్షలు
    • తెలంగాణలో 18-19 ఏళ్ల వయస్సు ఓటర్లు 3,35,043
    • తెలంగాణలో కొత్త ఓటర్లు 17,01,087
    • తెలంగాణలో తొలగించిన ఓట్లు 6,10,694
    • తెలంగాణలో ఏర్పాటు చేసే పోలింగ్‌ కేంద్రాలు 36,366
    • 78% పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌
    • సగటున ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో 897 మంది ఓటర్లు
    • తెలంగాణలో మోడల్‌ పోలింగ్ స్టేషన్లు 644
    • సి-విజిల్‌ ద్వారా ఫిర్యాదులు చేసేందుకు వెసులుబాటు
    • 100 నిమిషాల్లో ఫిర్యాదులపై స్పందన
    • వారం ముందే ఓటర్లకు ఓటింగ్‌ స్లిప్స్‌
    • పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలో మార్పులు
    • ట్రెయినింగ్‌కు వచ్చినప్పుడే సిబ్బందికి బ్యాలెట్స్‌
  • 09 Oct 2023 12:43 PM (IST)

    పోలింగ్‌ కేంద్రాల్లో మహిళలు బాధ్యతలు

    17,734 మోడల్ పోలింగ్ స్టేషన్లు, 621 పోలింగ్ స్టేషన్ల నిర్వహణ బాధ్యత పీడబ్ల్యూడీ సిబ్బందిదేనని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 8,192 పోలింగ్‌ కేంద్రాల్లో మహిళలు బాధ్యతలు చేపట్టనున్నారు.

  • 09 Oct 2023 12:41 PM (IST)

    తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల

    తెలంగాణ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుందని ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది.

  • 09 Oct 2023 12:41 PM (IST)

    తెలంగాణ ఎన్నిక నగార మోగింది

    ఎన్నికల తేదీలను ప్రకటించారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. నోటిఫికేషన్ నవంబర్ 3 2023. దరఖాస్తుల స్వీకరణ: నవంబర్ 10 2023. దరఖాస్తుల ఉపసంహరణ,నవంబర్ 15 2023. దరఖాస్తుల స్క్రూటినీ: నవంబర్ 13 2023. పోలింగ్ తేదీ: నవంబర్ 30 2023. ఎన్నికల కౌంటింగ్: డిసెంబర్ 3 2023.

Published On - Oct 09,2023 12:23 PM