Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pune-Mumbai: పూణె-ముంబై రైలు మార్గంలో తప్పిన పెను ప్రమాదం.. ఏం జరిగిందంటే..?

Pune-Mumbai: పూణె-ముంబై రైలు మార్గంలో తప్పిన పెను ప్రమాదం.. ఏం జరిగిందంటే..?

Anil kumar poka

|

Updated on: Oct 09, 2023 | 1:01 PM

పూణె-ముంబై రైలు మార్గంలో పెను ప్రమాదం తప్పింది. ఈ మార్గంలో రైలు పట్టాలపై వేర్వేరు చోట్ల దుండగులు బండరాళ్లు పెట్టారు. రైలు వస్తున్నప్పుడు అదురుకు అవి పడిపోకుండా వాటికి సపోర్టుగా మరికొన్ని రాళ్లు పేర్చారు. ఏకంగా ఐదు చోట్ల ఇలా బండరాళ్లను పెట్టారు దుండగులు. పూణె-ముంబై అప్‌లైన్‌పై వీటిని గుర్తించిన రైల్వే సిబ్బంది వాటిని తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది.

పూణె-ముంబై రైలు మార్గంలో పెను ప్రమాదం తప్పింది. ఈ మార్గంలో రైలు పట్టాలపై వేర్వేరు చోట్ల దుండగులు బండరాళ్లు పెట్టారు. రైలు వస్తున్నప్పుడు అదురుకు అవి పడిపోకుండా వాటికి సపోర్టుగా మరికొన్ని రాళ్లు పేర్చారు. ఏకంగా ఐదు చోట్ల ఇలా బండరాళ్లను పెట్టారు దుండగులు. పూణె-ముంబై అప్‌లైన్‌పై వీటిని గుర్తించిన రైల్వే సిబ్బంది వాటిని తొలగించడంతో పెను ప్రమాదం తప్పింది. ఇది తప్పకుండా సంఘవిద్రోహ శక్తుల పనేనని సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శివాజీ మనాస్‌పూర్ తెలిపారు. ఆ మార్గంలో అప్పటికే పనిచేస్తున్న పెట్రోలింగ్ బృందం బండరాళ్లను తొలగించినట్టు పేర్కొన్నారు. సమీప ప్రాంతాల్లోనూ తనిఖీ చేస్తున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. నాలుగు రోజుల క్రితం నార్త్ వెస్ట్రన్ రైల్వే అధికారులు ఉదయ్‌పూర్-జైపూర్ ట్రాక్‌పైనా బండరాళ్లను గుర్తించారు. వాటిని గమనించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సిబ్బంది బ్రేకులు వేసి ప్రమాదాన్ని నివారించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..