Monkey: బస్సులో కోతి షికారు.. విండో సీటులో కూర్చుని దర్జాగా కోతి ప్రయాణం..
లాంగ్ డ్రైవ్ అంటే చాలామందికి ఇష్టం. వీకెండ్స్‌లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి కొందరు బైక్‌లు, కార్లలో లాంగ్ డ్రైవ్‌కు వెళ్తుంటారు. సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఇక్కడ ఓ కోతికి కూడా లాంగ్ జర్నీ చేయాలనిపించినట్టుంది. మరి దానికి కార్లు, బైకులు ఉండవుకదా.. అందుకే తన లాంగ్ జర్నీ కోసం ఆర్టీసీ బస్సును ఎంచుకుంది. చక్కగా వెళ్లి ఆర్టీసీ బస్సులో ఓ విండో సీటు చూసుకుని దర్జాగా కూర్చొని తన లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేసింది.
లాంగ్ డ్రైవ్ అంటే చాలామందికి ఇష్టం. వీకెండ్స్‌లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి కొందరు బైక్‌లు, కార్లలో లాంగ్ డ్రైవ్‌కు వెళ్తుంటారు. సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఇక్కడ ఓ కోతికి కూడా లాంగ్ జర్నీ చేయాలనిపించినట్టుంది. మరి దానికి కార్లు, బైకులు ఉండవుకదా.. అందుకే తన లాంగ్ జర్నీ కోసం ఆర్టీసీ బస్సును ఎంచుకుంది. చక్కగా వెళ్లి ఆర్టీసీ బస్సులో ఓ విండో సీటు చూసుకుని దర్జాగా కూర్చొని తన లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో కర్నాటకలో తీసినట్టు తెలుస్తోంది. రోడ్డుపైన ఓ ఆర్టీసీ బస్సు దూసుకెళ్తోంది. అందులో ఓ సీటులో కోతి కూర్చుని ఉంది. బస్సులోకి ఆ కోతి ఎలా వచ్చిందో తెలియదు కానీ, ఓ సీటు మొత్తం ఆక్రమించేసింది. బస్సులో చాలామంది ప్రయాణికులు సీటు లేక నిలబడి ఉన్నారు. ఈ కోతిమాత్రం దర్జాగా విండో సీటులో కూర్చుని ప్రయాణిస్తోంది. సీటులో కూర్చుంటే బయట ఏమీ నిపించడంలేదో ఏమో లేచి కిటికీ మీద కూర్చుంది. కిటికీ అద్దం పట్టుకొని బయట వచ్చే పోయే వాహనాలను, కదులుతున్న చెట్లను ఆస్వాదిస్తూ ఉంది. బస్సులో ఉన్న ప్రయాణికులు కూడా ఆ కోతిని చూసి ఎంజాయ్ చేశారు. దానికి ఓ బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. కోతికూడా ఎలాంటి అల్లరి చేయకుండా బుద్ధిగా కూర్చుని బస్సులో ప్రయాణించింది. బస్సులో ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసి నెటిజన్లు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..