Teacher – Students: టీచర్ ని టార్గెట్ చేసిన విద్యార్థులు.. కాల్పులతో హల్ చల్.. రీల్‌లో బెదిరింపు..!
ఇద్దరు విద్యార్థులు ఒక టీచర్‌పై తుపాకీతో కాల్పులు జరిపారు. తాము గ్యాంగ్‌స్టర్లమని చెప్పుకున్న ఆ యువకులు ఆ టీచర్‌పై ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. ఖండౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలుపూర్‌లో సుమిత్ సింగ్ అనే వ్యక్తి ఒక కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతడి కోచింగ్ సెంటర్‌లో చదివిన ఇద్దరు విద్యార్థులు గురువారం ఆ టీచర్‌ను బయటకు పిలిచారు.
ఇద్దరు విద్యార్థులు ఒక టీచర్‌పై తుపాకీతో కాల్పులు జరిపారు. తాము గ్యాంగ్‌స్టర్లమని చెప్పుకున్న ఆ యువకులు ఆ టీచర్‌పై ఇంకా 39 సార్లు కాల్పులు జరుపుతామని వీడియోలో బెదిరించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ ఘటన జరిగింది. ఖండౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలుపూర్‌లో సుమిత్ సింగ్ అనే వ్యక్తి ఒక కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతడి కోచింగ్ సెంటర్‌లో చదివిన ఇద్దరు విద్యార్థులు గురువారం ఆ టీచర్‌ను బయటకు పిలిచారు. వెంట తెచ్చిన గన్‌తో ఆయన కాలుపై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కాలికి బుల్లెట్ గాయమైన టీచర్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీచర్ కాలుపై కాల్పులు జరిపి పారిపోయిన విద్యార్థులు తర్వాత ఒక రీల్ చేశారు. తమను తాము గ్యాంగ్‌స్టర్స్‌గా చెప్పుకున్నారు. ‘ఆరు నెలల తర్వాత తిరిగి వచ్చి ఆ టీచర్‌ను 40 సార్లు కాల్చుతానని ఇంకా 39 బుల్లెట్లు మిగిలి ఉన్నాయని ఒక విద్యార్థి వీడియోలో బెదిరించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇద్దరు యువకులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. టీచర్‌పై కాల్పులతోపాటు బెదిరింపు వీడియోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..