Hyderabad: కొట్టుకునేందుకు పోటీ..? వర్గపోరుగా మారిన కుస్తీ పోటీలు.. వీడియో.
హైదరాబాద్‌లో కుస్తీ పోటీలు కాస్తా వర్గపోరుగా మారాయి. ఇరు పక్షాల మధ్య తలెత్తిన వివాదంలో మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆ పై పోలీసులు ఎంటర్ కావడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో జఫర్ ఫైల్వాన్, సాలం పైల్వాన్ మధ్య పోటీ జరిగింది. అయితే ఈ పోటీల్లో గెలపు మాదంటే మాదంటూ వాగ్వాదానికి దిగారు.
హైదరాబాద్‌లో కుస్తీ పోటీలు కాస్తా వర్గపోరుగా మారాయి. ఇరు పక్షాల మధ్య తలెత్తిన వివాదంలో మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆ పై పోలీసులు ఎంటర్ కావడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో జఫర్ ఫైల్వాన్, సాలం పైల్వాన్ మధ్య పోటీ జరిగింది. అయితే ఈ పోటీల్లో గెలపు మాదంటే మాదంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఒక వర్గం వారు ప్రత్యర్ధులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడంతో కుస్తీ పోటీ కాస్తా ఇరు వర్గాల మధ్య కొట్లాటకు దారితీసింది. ఈ కొట్లాటలో పదిమందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. కుస్తీపోటీల్లో పాల్గొన్న ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే కుస్తీ పోటీల్లో పాల్గొన్న పైల్వాన్‌లు బంధువులే కావడం విశేషం. ఒకప్పుడు పైల్వాన్ అంటే ప్రజలకు అండగా నిలిచేవారు. ప్రస్తుతం పైల్వాన్ అంటే రౌడీ షీటర్లుగా. భూ కబ్జాదారులకు అండగా మారిపోయారని, రాను రాను వీరి ఆగడాలు పెరిగిపోతున్నాయని గతంలో అనేక సందర్భాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఫిర్యాదులు కూడా చేశారు. వీరిపై హైదరాబాద్ పోలీసులు దృష్టిసారించి పైల్వాన్‌ల అక్రమాలకు అడ్డుకట్టవేయాలని నగరవాసులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

