Lord Shiva: శివుడికి జమ్మి ఆకులతో పూజ చేయడానికి కొన్ని నియమాలు.. ప్రాముఖ్యత మీ కోసం..

శివలింగాన్ని శమీ ఆకులతో పూజించడం వల్ల భగవంతుడు త్వరగా ప్రసన్నుడై భక్తులపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడని విశ్వాసం. అయితే జమ్మి ఆకులతో శివుడికి పూజించే సమయంలో కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలను గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. కనుక ఈ రోజు శివలింగానికి శమీ ఆకులను సమర్పించే విధానం, ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం.

Lord Shiva: శివుడికి జమ్మి ఆకులతో పూజ చేయడానికి కొన్ని నియమాలు.. ప్రాముఖ్యత మీ కోసం..
Monday Puja Tips
Follow us
Surya Kala

|

Updated on: Oct 09, 2023 | 10:42 AM

లయకారుడు శివుడిని మహాదేవుడు అంటారు. జలాభిషేకం చేస్తే చాలు తనను పూజించిన భక్తులు కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడు. అందుకనే శంకరుడిని సంతోషపెట్టడం కూడా చాలా సులభమని అంటారు. హిందూ మతంలో  శివలింగ ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.  నీరు, బిల్వపత్రం, ఉమ్మెత్త, జమ్మి  ఆకులు మొదలైనవి శివలింగ పూజకు ముఖ్యమైనవిగా భావిస్తారు. శివలింగాన్ని శమీ ఆకులతో పూజించడం వల్ల భగవంతుడు త్వరగా ప్రసన్నుడై భక్తులపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడని విశ్వాసం. అయితే జమ్మి ఆకులతో శివుడికి పూజించే సమయంలో కొన్ని నియమాలున్నాయి. ఆ నియమాలను గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. కనుక ఈ రోజు శివలింగానికి శమీ ఆకులను సమర్పించే విధానం, ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం.

శివలింగ పూజా విధానం:

  1. తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ముందుగా శివాలయానికి వెళ్లి ఉత్తరం లేదా తూర్పు దిశలో శివలింగం దగ్గర కూర్చోవాలి.
  2. దీని తరువాత ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివలింగానికి నీటితో అభిషేకం చేయండి.
  3. శివునికి ఇష్టమైన పూలు, బిల్వ పత్రాలు, ఉమ్మెత్త, జమ్మి ఆకులను శివలింగానికి సమర్పించండి . అంతేకాదు  తప్పనిసరిగా తెల్లని వస్త్రాలు, జంధ్యం, అక్షతలు, జనపనారను కూడా సమర్పించాలి.
  4. శివలింగానికి జమ్మి ఆకులను సమర్పించేటప్పుడు.. తాజాగా ఆకులను మాత్రమే ఉపయోగించాలి.  అప్పటికప్పుడు కోసిన ఆకులతో మాత్రమే పూజకు ఉపయోగించాలి
  5. ఇవి కూడా చదవండి

శివలింగానికి జమ్మి ఆకులను సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు:

  1. శివ పురాణం ప్రకారం శివుని పూజలో జమ్మి ఆకులను చేర్చడం ద్వారా శివుడు త్వరగా సంతోషిస్తాడు. భక్తుల కోరికలన్నిటినీ నెరవేరుస్తాడు.
  2. శివలింగానికి శమీ ఆకులను సమర్పించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెబుతారు .
  3. జీవితంలో ఎదురయ్యే సమస్యలు తగ్గుతాయి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా లాభం ఉంటుంది.
  4.  శివుడికి అంకితం చేయబడిన సోమవారంన పరమశివుడిని భక్తితో పూజిస్తే..  ఎల్లప్పుడూ శివుడు మీతోనే ఉంటాడు. మీ జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.