సాధారణంగా గణేష్ చతుర్థి అంటే ఖైరతాబాద్ బడా గణేష్ నే గుర్తొస్తారు. 9, 11 రోజుల పాటు చతుర్థి ఉత్సవాలు ముగిసిన తర్వాత నిమజ్జనం పై మరింత ఉత్సాహం అందరిలో ఉండేది. ఆ శోభాయాత్ర అంటే ఆ కిక్ నే వేరు. ఖైరతాబాద్ బడా గణేష్ నుంచి సమీపంలోనే ఉన్న నెక్లెస్ రోడ్ కేవలం 500 మీటర్ల దూరం నే అయినా ఖైరతాబాద్ బస్తీ లోని వీదులనుంచి టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా రెండు కిలోమీటర్ల మేర శోభా యాత్ర జరగడానికి కనీసం 12 గంటలకు పైగా పట్టేదంటే ఏ స్థాయి లో నిమజ్జనోత్సవం ఎంత వైభవంగా జరిగేదో అర్దం చేసుకోవచ్చు. అంతటి ప్రాశస్త్యం ఖైరతాబాద్ బడా గణేష్ కు ఉంది.