Pension Scheme: సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్.. రూ. 5,000 రూపాయల నెలవారీ పెన్షన్ పోగొట్టుకోకండి..!

Pension Scheme: అక్టోబర్ 1, 2022 నుండి పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టలేరు. ఎందుకంటే పన్ను చెల్లింపుదారులకు..

Pension Scheme: సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్.. రూ. 5,000 రూపాయల నెలవారీ పెన్షన్ పోగొట్టుకోకండి..!
Pension Scheme
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 31, 2022 | 10:09 PM

Pension Scheme: అక్టోబర్ 1, 2022 నుండి పన్ను చెల్లింపుదారులు అటల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టలేరు. ఎందుకంటే పన్ను చెల్లింపుదారులకు అటల్ పెన్షన్ పథకాన్ని కేంద్రం ప్రభుత్వం నిలిపివేయబోతోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఆగస్టు 10న విడుదలైంది. అటల్ పెన్షన్ స్కీమ్ లేదా APY అనేది నామమాత్రపు మొత్తాన్ని జమ చేయడం ద్వారా 60 సంవత్సరాల తర్వాత గ్యారెంటీ పెన్షన్ పొందవచ్చు. ఈ పథకంలో, డిపాజిటర్‌కు కనీస నెలవారీ పెన్షన్ రూ. 1,000 (సంవత్సరానికి రూ. 12,000), గరిష్టంగా రూ. 5,000 (సంవత్సరానికి 60,000) ఇవ్వాలనే నిబంధన ఉంది. మీరు పన్ను చెల్లింపుదారులైతే.. 60 ఏళ్ల తర్వాత రూ. 5,000 వరకు పెన్షన్ పొందాలనుకుంటే సెప్టెంబర్ 30 లేదా అక్టోబర్ 1 లోపు అటల్ పెన్షన్ స్కీమ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందుకోసం అవకాశం ఉండదు.

20 30 సంవత్సరాల వయస్సు గల యువకులకు APYలో రూ. 5,000 పెన్షన్ అనేది తక్కువ అనిపించొచ్చు. అయితే, ఇందులో చాలా ఫీచర్లు ఉన్నాయి. ప్రధానమైన విషయం ఏంటంటే ఇది గ్యారెంటీ పెన్షన్ స్కీమ్. ఖచ్చితంగా ప్రతి నెలా మీ ఖాతాలో నిర్ణీత మొత్తంలో జమ చేయబడుతుంది. రెండవ ప్రత్యేకత ఏంటంటే, ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్. ఇందులో రెండు వేర్వేరు ఖాతాల నిబంధన ఉన్నాయి. ఇందులో మీరు జమ చేసిన మొత్తాన్ని ఒకేసారి ఉపసంహరించుకోలేరు. యాన్యుటీ పథకాన్ని కొనుగోలు చేయాలి. మరో విశేషమేమిటంటే, మిగిలిన పెన్షన్ పథకాలలో ఒకేసారి మొత్తం లేదా పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలి. అలా పెన్షన్ ఫండ్ సేకరించబడుతుంది. అటల్ పెన్షన్ విషయంలో అలా కాదు. ఇందులో తక్కుత మొత్తంలో డబ్బులు డిపాజిట్ చేయడం ద్వారా గ్యారెంటీ పెన్షన్ తీసుకోవచ్చు.

APY ప్రయోజనం..

ఇవి కూడా చదవండి

అటల్ పెన్షన్ స్కీమ్‌లో జీవితాంతం పెన్షన్ ఇవ్వబడుతుంది. చందాదారుని మరణానంతరం, అతని భార్య (లేదా భర్త) పెన్షన్‌కు సమానమైన మొత్తం ఇవ్వబడుతుంది. భార్య కూడా మరణించినప్పుడు, నామినీకి APY ఖాతాలో జమ చేసిన మొత్తం తిరిగి ఇవ్వబడుతుంది. ఈ పథకం గరిష్ట ప్రయోజనాన్ని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

30 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి 30 ఏళ్లపాటు నెలకు రూ. 577 (సంవత్సరానికి రూ. 6,924) చెల్లిస్తున్నారని అనుకుందాం. చందాదారుడికి 60 ఏళ్లు నిండిన తర్వాత.. అతను నెలకు రూ. 5,000 (ఏటా రూ. 60,000) పెన్షన్‌ పొందుతాడు. అతను 90 ఏళ్లపాటు జీవించాడనుకుంటే అతనికి 30 ఏళ్లపాటు పెన్షన్ వస్తుంది.

ఎంత పెన్షన్..

APYలో పెట్టుబడి పెట్టడానికి గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల 364 రోజుల వయస్సు వరకు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. కనీసం 19 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. ఉదాహరణకు, 40 సంవత్సరాల వయస్సులో పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన వ్యక్తి 20 సంవత్సరాల పాటు APY పెట్టుబడి పెట్టాలి. రూ. 5,000 పెన్షన్ కోసం, నెలవారీ కంట్రిబ్యూషన్ మొత్తం రూ. 1,454 అవుతుంది.

18 సంవత్సరాల వయస్సులో నెలవారీ రూ. 5,000 పెన్షన్‌ను ఎంచుకునే చందాదారుడు 42 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.210 డిపాజిట్ చేయాలి. అదే విధంగా, 24 సంవత్సరాల వయస్సులో రూ. 5,000 నెలవారీ పెన్షన్‌ను ఎంచుకునే చందాదారుడు 36 సంవత్సరాలకు నెలవారీ విరాళంగా రూ. 346 చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ కేయండి..