UP Assembly Election Results 2022: యోగి ఆదిత్యానాథ్, అఖిలేష్ యాదవ్ ముందంజ..
Assembly Election Results 2022: నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Election Results) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభమైంది...
Assembly Election Results 2022: నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Election Results) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాలలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక దేశ వ్యాప్తంగా అందరి చూపు ఉత్తరప్రదేశ్‌పైనే ఉంది. ఇక గోరఖ్‌పూర్ అర్బన్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటిసారి యోగి ఆదిత్యానాథ్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. ఇక ఆయన సమీప అభ్యర్థి భీమ్ ఆర్మీ చీప్ చంద్రశేఖర్ ఆజాద్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక్కడ బీఎస్పీ తన అభ్యర్థిని పోటీలో నిలుపలేదు. అదే విధంగా ఎస్పీ నుంచి సుభావతి శుక్లా పోటీ చేస్తున్నారు. ఆమె ఎస్పీ సీనియర్ నేత ఉపేంద్ర దత్ శుక్లా భార్య. 2020వ సంవత్సరంలో గుండెపోటుతో ఆయన మరణించారు. దీంతో ఆయన భార్యను ఈ ఎన్నికల్లో బరిలోకి దింపారు. సానుభూతి పవనాలు తమ పార్టీ అభ్యర్థికి మెరుగైన ఓట్లను తీసుకొస్తాయని అఖిలేష్ భావించారు కానీ.. ఆ పార్టీ కనీసం రెండో స్థానంలో కూడా ఇక్కడ లేకపోవడం గమనార్హం.
ఇక మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఈ ఎన్నికల్లో కర్హాల్ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. తాజా ఓట్ల లెక్కింపు వివరాల ప్రకారం చూస్తే.. ఈ నియోజకవర్గంలో ఆయన ముందంజలో ఉన్నారు. ఆయన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి, ప్రస్తుత కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ భాగెల్ రెండో స్థానంలో ఉన్నారు. ఇక్కడ అఖిలేష్ గెలుపు ఖాయమనే సర్వేలు కూడా వెల్లడించాయి. ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది.
ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. గోరఖ్ పూర్ నియోజకవర్గంలో యోగి ఆదిత్యనాథ్ ముందంజలో ఉండగా, కర్హల్ అసెంబ్లీ స్థానంలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం.. బీఎస్పీ, బీజేపీ అభ్యర్థులు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. యూపీలో బీజేపీదే హవా కొనసాగుతోంది. ఇక్కడ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఓట్ల లెక్కింపులో బీజేపీ – 242, సమాజ్‌వాదీ పార్టీ – 116, BSP – 9, కాంగ్రెస్ – 5 ముందంజలో ఉన్నాయి. అధికారంలోకి రావాలన్న ఎస్పీ ఆశలు ఆడియాశలయ్యాయి.
ఇవి కూడా చదవండి: