Assam Floods: అసోంలో వరద బీభత్సం.. నీటిలో మునిగిన రైల్వే స్టేషన్.. షాకింగ్ వీడియో

Assam Floods 2022: అసోంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి.

Assam Floods: అసోంలో వరద బీభత్సం.. నీటిలో మునిగిన రైల్వే స్టేషన్.. షాకింగ్ వీడియో
Assam Floods
Follow us

|

Updated on: May 17, 2022 | 12:44 PM

Assam Floods News: ఈశాన్య రాష్ట్రం అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. శనివారంనాటి నుంచి ఆ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. రెండు వందలకు పైగా గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరదల్లో చిక్కుకుని ఆరుగురు దుర్మరణం చెందగా.. కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో ఐదుగురు మృతి చెందినట్లు అసోం ప్రభుత్వం ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. మరో ఇద్దరు గల్లంతయ్యారు. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. పంటలు నాశనమయ్యాయి. కొండ చరియలు విరిగిపడటం, రైల్వే ట్రాక్‌లు, వంతెనలు దెబ్బనడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది.

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో నార్త్‌ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఆర్మీ, పారా మిలటరీ దళాలు, ఎస్‌డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపడుతున్నాయి. 20 జిల్లాల్లోని 652 గ్రామాల్లో నివసిస్తున్న దాదాపు 2 లక్షల మందిపై భారీ వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.  వరదల కారణంగా 57 వేల మంది నిరాశ్రయులయ్యారు. 55 తాత్కాలిక పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి.. బాధితులను అక్కడకు తరలించారు అధికారులు. మరీ ముఖ్యంగా ఆరు జిల్లాలో వరద నీరు పోటెత్తింది. దిమా హసావో జిల్లాలో మూడు రోజులుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. అక్కడ 12 గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

ఇవి కూడా చదవండి

న్యూ హఫ్లాంగ్ రైల్వే స్టేషన్ పూర్తిగా వరదల్లో మునిగిపోయింది. కొండ చరియలు విరిగిపడి వరదనీరు పోటెత్తడంతో అక్కడ భీతావహ పరిస్థితి నెలకొంది. రైల్వే స్టేషన్‌లోని రెండు రైళ్లు కూడా వరదనీటిలో మునిగిపోయాయి. హఫ్లాంగ్-దేహంగీ, న్యూ హఫ్లాంగ్-జోరై-మిచిదుయ్‌ ప్రాంతాల్లో ముగ్గురు చనిపోయారు. 80 ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. దాంతో వాహనాల రాకపోకలకు అంతరాయడం ఏర్పడింది. భారత వైమానిక దళం, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. వరదల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అసోంలో వరద బీభత్సం..

Continuous rains wreak havoc in parts of Assam. In the hill district of Dima Hasao, main road links disrupted, stationery train coaches derailed, multiple landslides reported. (Images courtesy NF railways) @IndianExpress pic.twitter.com/OFCIjBdeqN

మైబాంగ్, మహూర్ మధ్య కొండచరియలు విరిగిపడటంతో గంటలపాటు రైల్వే సేవలు నిలిచిపోయాయి. దెబ్బతిన్న ట్రాక్‌లను సరిచేసేందుకు రైల్వే బృందాలు చర్యలు తీసుకున్నాయి. హఫ్లాంగ్ పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈదురు గాలులకు పట్టణంలోని పలు దుకాణాలు, ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా చాలా రహదారులు నీటిలోనే ఉన్నాయి. హరంగాజావో, గుంజంగ్, మైబాంగ్‌తో సహా పలుచోట్ల చెట్లు నేలకూలాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హాజయ్‌ జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడిన ఐఏఎఫ్ దళాలు..

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
కస్టమర్లకు షాకివ్వనున్న ఐసీఐసీ..మే 1 నుంచి 10 రకాల ఛార్జీలు
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
వరుస ఓటములున్నా.. ఛేజింగ్‌లో పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డ్..
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో