Pawan Hans: పవన్‌హన్స్ విషయంలో వెనక్కి తక్కిన కేంద్రం.. కీలక ప్రకటన విడుదల..!

Pawan Hans: పవన్‌హన్స్‌ విషయంలో ఎట్టకేలకు కేంద్రం వెనుకడుగు వేసింది. ప్రభుత్వ రంగ సంస్థ పవన్‌హన్స్‌ హెలికాప్టర్ల కంపెనీలో వాటా విక్రయంపై కీలక నిర్ణయం

Pawan Hans: పవన్‌హన్స్ విషయంలో వెనక్కి తక్కిన కేంద్రం.. కీలక ప్రకటన విడుదల..!
Phl
Follow us
Shiva Prajapati

|

Updated on: May 17, 2022 | 8:22 AM

Pawan Hans: పవన్‌హన్స్‌ విషయంలో ఎట్టకేలకు కేంద్రం వెనుకడుగు వేసింది. ప్రభుత్వ రంగ సంస్థ పవన్‌హన్స్‌ హెలికాప్టర్ల కంపెనీలో వాటా విక్రయంపై కీలక నిర్ణయం తీసుకుంది. వాటా విక్రయాన్ని నిలిపేస్తున్నట్టు ప్రకటించింది కేంద్రం. స్టార్‌9 మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి పవన్‌హన్స్‌ సంస్థలో 51 శాతం వాటా విక్రయాన్ని ఆపేసింది. నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ ఆదేశాల తరువాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. స్టార్‌9 మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వాటాదారుల బ్యాక్‌గ్రౌండ్‌ను NCLT ప్రశ్నించింది. స్టార్‌9 మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ప్రధాన వాటాదారుగా ఉన్న almas global oppurtunity fund లావాదేవీలపై NCLT తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోల్‌కతాకు చెందిన ఈఎంసీ లిమిటెడ్‌ను గతంలో అల్మాస్‌ గ్లోబల్‌ రూ. 568 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే గడువు లోగా డబ్బులు చెల్లించకుండా చేతులు ఎత్తేసింది. ఈ వ్యవహారంపై NCLT తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్మాస్‌ గ్లోబల్‌పై కఠినచర్యలకు ఆదేశాలు జారీ చేసింది. దివాళా తీసిన సంస్థ పవన్‌హన్స్‌ హెలికాప్టర్ల కంపెనీని ఎలా కొనుగోలు చేస్తుందన్న విమర్శలు వచ్చాయి.

ఏప్రిల్‌ 29వ తేదీన పవన్‌ హన్స్‌ హెలికాప్టర్ల కంపెనీని స్టార్‌9 మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి అమ్మేందుకు కేబినెట్‌ గ్రూపు ఆమోదం తెలిపింది. అయితే NCLT అభ్యంతరంతో ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పవన్‌హన్స్‌ సంస్థలో 51 శాతం కేంద్రానికి వాటా ఉండగా 49 శాతం వాటా ఓఎన్‌జీసీకి ఉంది. ప్రభుత్వం ప్రతిపాదించిన రేటుకే ONGC 51 శాతం వాటా కొనడానికి ముందుకు వచ్చినప్పటికి.. స్టార్‌9 మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కే ఎందుకు కట్టబెడుతున్నారని కాంగ్రెస్‌ గతంలో తీవ్రంగా విమర్శించింది.

ఇవి కూడా చదవండి

2019-20లో పవన్‌ హన్స్‌ రూ. 28.08 కోట్లు, 2018-19లో 69.2 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2020-21లో రూ. 100 కోట్ల మేర నష్టపోవాల్సి వచ్చింది. సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో కేంద్రం పవన్‌ హన్స్‌ను ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమయ్యింది. పవన్‌ హన్స్‌ 1985లో స్థాపించారు. ప్రస్తుతం కంపెనీకి 42 హెలికాప్టర్లు ఉన్నాయి. ఈ హెలికాప్టర్ల సగటు జీవిత కాలం 20 ఏళ్లకు పైగా ఉంది.