16 న మళ్ళీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణం.. వేదిక.. రామ్ లీలా మైదానం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీని 62 సీట్లలో గెలిపించుకుని ఘన విజయం సాధించిన ఆప్ పార్టీ అధినేత.. సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఈ నెల 16 న (ఆదివారం) మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  మూడో సారి ఆయన ఢిల్లీ పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలోప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. కేజ్రీవాల్ బుధవారం ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తో సుమారు 15 నిముషాలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో […]

  • Umakanth Rao
  • Publish Date - 12:58 pm, Wed, 12 February 20
16 న మళ్ళీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణం.. వేదిక.. రామ్ లీలా మైదానం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీని 62 సీట్లలో గెలిపించుకుని ఘన విజయం సాధించిన ఆప్ పార్టీ అధినేత.. సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఈ నెల 16 న (ఆదివారం) మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  మూడో సారి ఆయన ఢిల్లీ పీఠాన్ని అధిరోహించబోతున్నారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలోప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. కేజ్రీవాల్ బుధవారం ఉదయం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తో సుమారు 15 నిముషాలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తన ప్రమాణ స్వీకార కార్యక్రమ తేదీని, స్థలాన్ని ఆయన ఖరారు చేసుకున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కేజ్రీవాల్ ఇవాళ కలుసుకోనున్నారు. ఆయనను వారు తమ పార్టీ లెజిస్లేచర్ నేతగా ఎన్నుకుంటారని తెలిసింది. అనంతరం .. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా తనను ఆహ్వానించాలని కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ ని కోరనున్నట్టు తెలుస్తోంది. అటు-ఈ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. 2015 లో జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ మూడు స్థానాలను మాత్రమే దక్కించుకున్న విషయం  గమనార్హం.