నా సభకు 70 లక్షల మంది వస్తేనే బెటర్.. ట్రంప్

ఈ నెలాఖరులో తను జరపబోయే తొలి భారత పర్యటన పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. తన విజిట్ సందర్భంగా భారత-అమెరికా దేశాల మధ్య ఓ వాణిజ్య ఒప్పందం కుదరవచ్చునని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రధాని మోదీ ఆహ్వానంపై ట్రంప్ ఈ నెల 24-25 తేదీల్లో ఇండియాకు రానున్నారు. ఢిల్లీతో బాటు గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరాన్ని కూడా ఆయన సందర్శించనున్నారు. ఆ సిటీలోని భారీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో మోదీ, […]

నా సభకు 70 లక్షల మంది వస్తేనే బెటర్.. ట్రంప్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 23, 2020 | 12:34 PM

ఈ నెలాఖరులో తను జరపబోయే తొలి భారత పర్యటన పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. తన విజిట్ సందర్భంగా భారత-అమెరికా దేశాల మధ్య ఓ వాణిజ్య ఒప్పందం కుదరవచ్చునని భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రధాని మోదీ ఆహ్వానంపై ట్రంప్ ఈ నెల 24-25 తేదీల్లో ఇండియాకు రానున్నారు. ఢిల్లీతో బాటు గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరాన్ని కూడా ఆయన సందర్శించనున్నారు. ఆ సిటీలోని భారీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో మోదీ, ట్రంప్ ఇద్దరూ సంయుక్తంగా ప్రసంగించనున్నారు. తన ఓవల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. మోదీ జెంటిల్ మన్.. ఆయనను సాధ్యమైనంత త్వరగా కలవాలని అనుకుంటున్నాను అని చెప్పారు. భారతీయులు (ప్రభుత్వం) ఏదో కోరుకుంటున్నారు.  మా భేటీ సందర్భంగా సరైన ఒప్పందమే కుదురుతుందని భావిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. గత మూడేళ్ళుగా ట్రంప్, మోదీ ఇద్దరి మధ్య వ్యక్తిగతంగా మంచి సాన్నిహిత్యం పెరిగింది. గాఢ స్నేహితులయ్యారు. 2019 లో వీరు నాలుగు సార్లు సమావేశమయ్యారు.  హూస్టన్ లో 50 వేల మంది ప్రవాసాంధ్రులు హాజరైన బిగ్గెస్ట్ ఈవెంట్ కూడా వీటిలో ఉంది. ఆ కార్యక్రమంలో సంయుక్తంగా వీరు పాల్గొన్నారు. ఈ ఏడాది రెండు సార్లు ఫోన్లో మాట్లాడారు.

అహ్మదాబాద్ లో మీకు వెల్ కమ్ చెప్పడానికి వేలాది భారతీయులు సిధ్ధంగా ఉన్నారని మోదీ చెప్పారని, అయితే సాధారణంగా తమ దేశంలో తాను పాల్గొనే కార్యక్రమాలకు 40వేలనుంచి 50 వేల మంది ప్రజలు వస్తారని ట్రంప్ అన్నారు. ‘ మా దేశంలో లక్షలాది ప్రజలు ఉన్నారని మోదీ చెప్పారు. కానీ హూస్టన్ లో జరిగిన కార్యక్రమానికి 40 వేల మంది మాత్రమే హాజరయ్యారు. నాకిది సరైనదిగా తోచడంలేదు. అహ్మదాబాద్ లో విమానాశ్రయం నుంచి భారీ క్రికెట్ స్టేడియం వరకు కనీసం 50 లక్షల నుంచి 70 లక్షల వరకు జనాలు రావాలని నేను కోరుతున్నా’ అని ట్రంప్ పేర్కొన్నారు. పైగా ఆ నగరంలో మోడీ నిర్మిస్తున్న అతి పెద్ద స్టేడియం అది అని తాను  విన్నానని ఆయన చెప్పారు. అహ్మదాబాద్ లోని మోతేరా స్టేడియాన్ని 100 మిలియన్ యుఎస్ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. అక్కడ సుమారు లక్షమందికి చోటు ఉందట.. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో గల క్రికెట్ స్టేడియం కన్నా ఇది అతి పెద్దదని సమాచారం.కాగా ట్రంప్ చేయనున్న భారత పర్యటన పట్ల ప్రధాని మోదీ హర్షం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు .

కలలో మీ ఫ్యామిలీ మెంబర్స్ చావును చూశారా? దానికి అర్థం ఇదే!
కలలో మీ ఫ్యామిలీ మెంబర్స్ చావును చూశారా? దానికి అర్థం ఇదే!
ఓటీటీలోకి వచ్చేసిన ఓ మై గాడ్ 2 తెలుగు వెర్షన్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన ఓ మై గాడ్ 2 తెలుగు వెర్షన్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఏంటీ ఆ బ్యూటీ.. ఈవిడా ఒకటేనా.!! ఈ అమ్మడు ఎంతలా మారిపోయిందో
ఏంటీ ఆ బ్యూటీ.. ఈవిడా ఒకటేనా.!! ఈ అమ్మడు ఎంతలా మారిపోయిందో
మామిడి ఆకుల్ని ఇలా తీసుకున్నారంటే.. అద్భుతంగా పని చేస్తాయి..
మామిడి ఆకుల్ని ఇలా తీసుకున్నారంటే.. అద్భుతంగా పని చేస్తాయి..
స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్సుల్లో రోడ్డెక్కిన యువ జంట షికారు..!
స్పైడర్‌ మ్యాన్‌ డ్రెస్సుల్లో రోడ్డెక్కిన యువ జంట షికారు..!
ఫుడ్ ఆర్డర్‌ను ఆవురావురుమంటూ తెరిచింది.. కట్ చేస్తే.. షాక్.!
ఫుడ్ ఆర్డర్‌ను ఆవురావురుమంటూ తెరిచింది.. కట్ చేస్తే.. షాక్.!
మొదలైన పుష్ప నామస్మరణ.. పుష్ప ఆర్టిస్ట్ లా లీక్స్ వైరల్.!
మొదలైన పుష్ప నామస్మరణ.. పుష్ప ఆర్టిస్ట్ లా లీక్స్ వైరల్.!
కుజ, గురు గ్రహాల మధ్య పరివర్తన..ఆ రాశుల వారికి కొన్ని కష్టనష్టాలు
కుజ, గురు గ్రహాల మధ్య పరివర్తన..ఆ రాశుల వారికి కొన్ని కష్టనష్టాలు
కలబంద రసంలో ఆరోగ్య రహస్యం దాగుంది.. ఎందుకో తెలుసా?
కలబంద రసంలో ఆరోగ్య రహస్యం దాగుంది.. ఎందుకో తెలుసా?
మీటింగ్ అవాంతరాల నుంచి ఈజీగా ‘స్విచ్’ అయిపోండి.. సూపర్ ఫీచర్..
మీటింగ్ అవాంతరాల నుంచి ఈజీగా ‘స్విచ్’ అయిపోండి.. సూపర్ ఫీచర్..