ఢిల్లీ ఎన్నికల ఓటింగ్ శాతం ఎంత ? ఈసీపై కేజ్రీవాల్ ఫైర్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే ఎంత శాతం ఓటింగ్ జరిగిందన్నఅంశాన్ని  ఎన్నికల కమిషన్ ఇంకా ప్రకటించకపోవడంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇది చాలా షాకింగ్ అని ఆదివారం ట్వీట్ చేశారు. మొత్తం ఓటింగ్ శాతం ఎందుకు రిలీజ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ‘ఈసీ ఏం చేస్తోంది ? పోలింగ్ ముగిసి ఇన్ని గంటలు గడిచినా శాతాన్ని ఎందుకు రిలీజ్ చేయలేదు’ అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే […]

ఢిల్లీ ఎన్నికల ఓటింగ్ శాతం ఎంత ? ఈసీపై కేజ్రీవాల్ ఫైర్
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 09, 2020 | 5:36 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే ఎంత శాతం ఓటింగ్ జరిగిందన్నఅంశాన్ని  ఎన్నికల కమిషన్ ఇంకా ప్రకటించకపోవడంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇది చాలా షాకింగ్ అని ఆదివారం ట్వీట్ చేశారు. మొత్తం ఓటింగ్ శాతం ఎందుకు రిలీజ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. ‘ఈసీ ఏం చేస్తోంది ? పోలింగ్ ముగిసి ఇన్ని గంటలు గడిచినా శాతాన్ని ఎందుకు రిలీజ్ చేయలేదు’ అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే 22 గంటలు గడిచాయని, ఈ జాప్యం ఎందుకని అన్నారు. ఈ ఎన్నికల్లో సుమారు 1.47 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మొదట ఈసీ 57.06 శాతం ఓటింగ్ జరిగినట్టు తాత్కాలికంగా ప్రకటించింది. అయితే 2015 లో 67.5 శాతం జరిగినట్టు నాడు పేర్కొంది. శనివారం రోజంతా ఈసీ స్మార్ట్ ఫోన్ యాప్ పై విడుదల చేసిన సంఖ్యకు, ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ప్రతి రెండు గంటలకు విడుదల చేసిన పోలింగ్ శాతానికి మధ్య చాలా వ్యత్యాసం కనిపించింది. చివరకు ఈసీ అధికార ప్రతినిధి షెఫాలీ శరణ్.. యాప్ కు సంబంధించి.. రాత్రి 10.17 గంటల స్క్రీన్ షాట్ తీసి.. 61.43 శాతం ఓటింగ్ జరిగినట్టు అంచనా అని పేర్కొన్నారు. కాగా-ఈ ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్ జరిగిందని ఆప్ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది.