కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. తిరగబడిన సొంత పార్టీ స్పీకర్
సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీకి.. ఇప్పుడు సొంత పార్టీ నుంచే షాక్ లపై షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ సీఏఏ విషయంలో కొందరు నేతలు దూరమైన విషయం తెలిసిందే. అయితే సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అసెంబ్లీ సాక్షిగా వ్యతిరేక తీర్మానాలు చేశాయి. అందులో రాజస్థాన్ కూడా ఒకటి. రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేది లేదని.. సీఎం అశోక్ గెహ్లాట్ స్పష్టం చేస్తూ.. అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అయితే […]
సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీకి.. ఇప్పుడు సొంత పార్టీ నుంచే షాక్ లపై షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ సీఏఏ విషయంలో కొందరు నేతలు దూరమైన విషయం తెలిసిందే. అయితే సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అసెంబ్లీ సాక్షిగా వ్యతిరేక తీర్మానాలు చేశాయి. అందులో రాజస్థాన్ కూడా ఒకటి. రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేది లేదని.. సీఎం అశోక్ గెహ్లాట్ స్పష్టం చేస్తూ.. అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అయితే ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి చేసిన వ్యాఖ్యలతో పార్టీ అధిష్టానం ఖంగుతింది. సొంత పార్టీకి చెందిన స్పీకర్ జోషి.. సీఎం అభిప్రాయంతో విభేదించారు. రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఉమ్మడి జాబితాలో ఉండే అంశాలపై మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురాగలుతుందన్నారు. జైపూర్‌లోని ప్రభుత్వ కాలేజీలో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో జోషి ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఏఏపై దేశంలో చర్చ జరుగుతోందన్న ఆయన.. ఇది ఒక చట్టమని.. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసేందుకు వీలుండదన్నారు. ఉదాహరణకు, మోటార్ వాహనాల చట్టం కింద కేంద్ర ప్రభుత్వం చట్టం తెస్తే.. దాన్ని అమలు చేయాలనుకుంటున్నదీ లేనిదీ రాష్ట్రాలు చెప్పొచ్చని.. కానీ పౌరసత్వ చట్టం అనేది భారత రాజ్యాంగ చట్టం కిందకు వస్తుందని తెలిపారు. అంతేకాదు.. దీనిని తిరగరాయడానికి లేదా జోక్యం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కుదరదని స్పీకర్ జోషి స్పష్టం చేశారు.
కాగా, ఈ సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. రాజస్థాన్ ప్రభుత్వమే కాకుండా.. కేరళ, పంజాబ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు సైతం సీఏఏ వ్యతిరేక తీర్మానాలను చేపట్టాయి.