Coronavirus Vaccine: ప్రజలందరికీ.. ఫ్రీగా కోవిడ్ వ్యాక్సిన్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటన..

Delhi CM Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం 22 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. వందలాది మంది మరణిస్తున్నారు. కరోనా కట్టడి కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం

Coronavirus Vaccine: ప్రజలందరికీ.. ఫ్రీగా కోవిడ్ వ్యాక్సిన్.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటన..
Arvind Kejriwal
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 26, 2021 | 2:05 PM

Delhi CM Arvind Kejriwal: దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం 22 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. వందలాది మంది మరణిస్తున్నారు. కరోనా కట్టడి కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం కీలక ప్రకటన చేశారు. 18 ఏళ్లు దాటిన వారందరికీ కోవిడ్-19 వ్యాక్సీన్లు ఉచితంగా ఇవ్వనున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీనికోసం ఢిల్లీ ప్రభుత్వం 1.34 కోట్ల డోసుల కొనుగోలుకు అమోదం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. వ్యాక్సీన్‌ కొనుగోలు, దాన్ని ప్రజలకు అందించే ప్రక్రియను సాధ్యమైనంత వేగంగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని దానికోసం ప్రణాళికను సైతం రూపొందించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. అయితే ఇది కేవ‌లం ప్ర‌భుత్వ ఆసుప‌త్రులకే ప‌రిమిత‌య్యే అవ‌కాశం ఉందని.. ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు వెళ్లే వాళ్లు డ‌బ్బులు చెల్లించాల్సి రావ‌చ్చని తెలిపారు.

అయితే.. కోవిడ్-19 వ్యాక్సీన్ల ధర అందరికీ సమానంగా ఉండాలని.. ఈ ధరను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. వ్యాక్సీన్ తయారీదారులు కూడా ధరను తగ్గించాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. డోసు రూ.150కే ఇవ్వాల‌ని కోరారు. ఇది మానవత్వంతో సాయం చేయాల్సిన సమయమని.. లాభాల కోసం చూసే సమయం కాదని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. లాభాలను అర్జించడానికి ఇంకా చాలా సమయం ఉందన్నారు. కాగా.. ఢిల్లీలో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం గతవారం నుంచి లాక్‌డౌన్ నిర్వహిస్తున్నారు. కేవలం అత్యవసర సర్వీసులకే మినహాయింపు ఇచ్చారు.

Also Read:

‘చర్చలు చాలు, వ్యాక్సిన్ ని ఉచితంగా ఇవ్వండి’, కేంద్రానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచన

Oxygen Shortage: కోవిడ్ సోకిన భర్తను కాపాడుకునేందుకు భార్య ప్రయత్నం.. నోటి ద్వారా శ్వాస.. అయినా దక్కని ప్రాణం..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?