‘చర్చలు చాలు, వ్యాక్సిన్ ని ఉచితంగా ఇవ్వండి’, కేంద్రానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచన

కోవిడ్ పై పోరులో బీజేపీ ఇండియాను తన సిస్టం కి బాధితురాలిగా చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మీ ముందు చూపు కొరవడడమే ఈ దుస్థితికి కారణమన్నారు. దేశంలో ప్రజలందరికీ ఉచితంగా టీకామందు ఇవ్వాలని,..

  • Publish Date - 1:03 pm, Mon, 26 April 21 Edited By: Anil kumar poka
'చర్చలు చాలు, వ్యాక్సిన్ ని ఉచితంగా ఇవ్వండి', కేంద్రానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సూచన
Rahul Gandhi

కోవిడ్ పై పోరులో బీజేపీ ఇండియాను తన సిస్టం కి బాధితురాలిగా చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మీ ముందు చూపు కొరవడడమే ఈ దుస్థితికి కారణమన్నారు. దేశంలో ప్రజలందరికీ ఉచితంగా టీకామందు ఇవ్వాలని, ఇక దీనిపై చర్చలు అనవసరమని ఆయన ట్వీట్ చేశారు. ఈ దేశాన్ని మీ వ్యవస్థకు బాధితురాలిగా చేయకండి అని ఆయన కోరారు. కోవిడ్ వ్యాక్సిన్ ధరలపై దేశంలో జోరుగా డిబేట్ జరుగుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన సరళీకృత ధరల వ్యూహం ప్రకారం (లిబరలైజ్డ్ ప్రైసింగ్ అండ్ యాక్సిలరేటెడ్ నేషనల్ కోవిడ్-19 స్ట్రాటజీ) మే 1 నుంచి వ్యాక్సిన్ కి సంబంధించి మూడు వేర్వేరు ధరల వ్యవస్థ ఉంటుందని కేంద్రం ప్రకటించింది. దీనిపైనే రాహుల్ స్పందించారు. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు తాము డోసు 400 రూపాయలకు, ప్రైవేటు ఆసుపత్రులకు 600 రూపాయలకు విక్రయిస్తామని సీరం సంస్థ ప్రకటించగా.. భారత్ బయో టెక్ తమ కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్ ని రాష్ట్రాలకు 600 రూపాయలకు, ప్రైవేటు ఆసుపత్రులకు 1200 రూపాయలకు అమ్ముతామని పేర్కొంది. అయితే కేంద్రానికి మాత్రం దీని ధర డోసు 150  రూపాయలు మాత్రమే ఉంటుంది.

కానీ కేరళ వంటి కొన్ని  రాష్ట్రాలు ఈ విధానాన్ని తప్పు పడుతున్నాయి. ప్రజలకు ఉచితంగానే టీకామందులు ఇవ్వాలని కోరుతున్నాయి. లేని పక్షంలో తమకు  నిధుల కొరత తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే కేంద్రానికి తక్కువధరకే వ్యాక్సిన్ అమ్ముతున్నారన్న ఆరోపణను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఖండించారు. ఈ అభిప్రాయం తప్పు అని ఆయన తన ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. కేంద్రానికి, వ్యాక్సిన్ ఉత్పాదక సంస్థలకు మధ్య గతంలోనే ఈ నిర్దిష్ట ప్రైసింగ్ విధానానికి ఒడంబడిక కుదిరిందన్నారు. అటు- ఆక్సిజన్ సంక్షోభంపై ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం తలెత్తింది. నగరంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో ఢిల్లీ  సర్కార్ కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని కేంద్రం ఆరోపిస్తుండగా, దీన్ని కేజ్రీవాల్ ప్రభుత్వం ఖండించింది.