Oxygen Shortage: కోవిడ్ సోకిన భర్తను కాపాడుకునేందుకు భార్య ప్రయత్నం.. నోటి ద్వారా శ్వాస.. అయినా దక్కని ప్రాణం..

Coronavirus Patient: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ లక్షలాది కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. ఈ విపత్కర

Oxygen Shortage: కోవిడ్ సోకిన భర్తను కాపాడుకునేందుకు భార్య ప్రయత్నం.. నోటి ద్వారా శ్వాస.. అయినా దక్కని ప్రాణం..
Coronavirus Patient
Follow us

|

Updated on: Apr 26, 2021 | 12:16 PM

Coronavirus Patient: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజూ లక్షలాది కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. అత్యవసర సమయంలో మెడికల్ ఆక్సిజన్ అందక రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన సంఘటన అందరినీ కలచివేస్తోంది. ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. శ్వాస ఆడక.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన భర్తను కాపాడుకోవడం కోసం.. భార్య తన నోటితో శ్వాస అందిస్తూ బ్రతికించుకునే ప్రయత్నం చేసింది. అయినా.. భర్త ప్రాణం నిలవకపోవడంతో.. ఆ మహిళ గుండెలవిసేలా రోదించింది. ఈ సంఘటన శుక్రవారం జరగ్గా.. ప్రస్తుతం ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆగ్రాలోని హౌసింగ్ డెవలప్‌మెంట్ సెక్టార్ -7 నివాసి రవి సింఘాల్ (47) కోవిడ్‌తో బాధపడుతున్నాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో అతని భార్య రేణు సింఘాల్ బంధువులతో కలిసి ఆసుపత్రికి ఆటోలో బయలు దేరింది. ముందు రామా హాస్పిటల్ ఆ తర్వాతసాకేత్ హాస్పిటల్, కేజీ నర్సింగ్ హోమ్‌కు వెళ్లినా.. పడకలు అందుబాటులో లేక సింఘాల్‌ను చేర్చుకులేదు. చివరకు రేణు తన భర్తను తీసుకోని ఆటోలో ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి చేరుకుంది. ఈ క్రమంలో ఆక్సిజన్ అందక కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తన భర్తను కాపాడుకునేందుకు తన నోటితో శ్వాస అందించింది. ఎలాగైనా తన భర్త ప్రాణాన్ని దక్కించుకోవాలని పదే పదే నోటితో శ్వాస అందించింది.

Covid 19 Patient

Covid 19 Patient

ఈ క్రమంలో రవిని పరీక్షించిన వైద్యులు.. చనిపోయినట్లు తెలిపారు. తన భర్త మరణించాడన్న విషయం తెలిసి రేణు కన్నీరుమున్నీరయ్యింది. గుండెలవిసేలా రోదిస్తూ కుప్పకూలింది. తన భర్తను కాపాడుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయంటూ రోదించింది. ప్రస్తుతం ఈ చిత్రం దేశంలో జరుగుతున్న సంఘటనలకు సక్షాత్కారమిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలాఉంటే.. ఉత్తరప్రదేశ్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆక్సిజన్ నిల్వలు లేక ఇక్కడ కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు.

Also Read:

Oxygen Concentrators: భారత్‌కు అమెజాన్ సాయం.. సింగపూర్ నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు..

India Covid-19: దేశంలో నిన్న 3.5 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు.. రికార్డు స్థాయిలో మరణాలు

Latest Articles
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
జాబ్‌ కోసం ప్రయత్నించి ఫెయిల్ అయిన యువతి నేడు సక్సెస్‌కు చిరునామా
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
ఏపీ కొత్త డీజీపీగా ఆయనకు అవకాశం..? రేసులో నలుగురు ఐపీఎస్‎లు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
నేను చనిపోయానంటూ వార్తలు పుట్టించారు..
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
ఈ హైవేను నిర్మించిన తీరుపై ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
బయటకు వెళ్లి ఏం తినేటట్టు లేదు.. చివరికి ఐస్ క్రీం కూడా
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నేటి రాశి ఫలాలు
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ రిలీజ్
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
మాస శివరాత్రి రోజున ఏర్పడిన శుభయోగాలు.. శివయ్యను ఇలా పూజించండి
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు