AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah: దశాబ్దాల పాటు ఆర్టికల్ 370 అమల్లో ఉన్నా కాశ్మీర్ ఎందుకు అల్లకల్లోలంగా ఉండిపోయింది.. అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు

Amit Shah on Article 370: నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ రెండోసారి ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత 2019 ఆగస్టు 6న జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేసిన

Amit Shah: దశాబ్దాల పాటు ఆర్టికల్ 370 అమల్లో ఉన్నా కాశ్మీర్ ఎందుకు అల్లకల్లోలంగా ఉండిపోయింది.. అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు
Amit Shah
Shaik Madar Saheb
|

Updated on: Dec 04, 2021 | 9:12 PM

Share

Amit Shah on Article 370: నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ రెండోసారి ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత 2019 ఆగస్టు 6న జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. ఆ తర్వాత ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు కేంద్రం పెద్ద ఎత్తున చర్యలు ప్రారంభించింది. దీంతో జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 దశాబ్దాలుగా అమలులో ఉంది.. కానీ శాంతి ఎందుకులేదంటూ హోం మంత్రి అమిత్ షా ప్రశ్నించారు. రాజ్యాంగ నిబంధనను 2019 రద్దు చేయడంతోనే అక్కడ శాంతి నెలకొనడంతోపాటు, మంచి వ్యాపార పెట్టుబడులు, పర్యాటకుల ప్రవాహానికి దారితీసిందని స్పష్టంచేశారు.

ఆర్టికల్ 370ని పునరుద్ధరించే వరకు కేంద్ర పాలిత ప్రాంతంలో శాంతిని నెలకొల్పడం సాధ్యం కాదని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన ప్రకటనను షా ఖండించారు. శనివారం ఢిల్లీలో జరిగిన హెచ్‌టి లీడర్‌షిప్ సమ్మిట్‌లో అమిత్‌ షా పలు వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ‘‘గత 75 ఏళ్లుగా ఆర్టికల్ 370 ఉంది.. శాంతి ఎందుకు లేదు? శాంతికి, ఆర్టికల్ 370కి మధ్య సంబంధం ఉంటే.. 1990లో ఆర్టికల్‌ ఉంది కదా? అప్పుడు శాంతి ఎందుకు లేదు? గతంలో చోటుచేసుకున్న హత్యల గణాంకాలను పరిశీలిస్తే.. ప్రస్తుతం 10 శాతానికి కూడా చేరుకోలేదు.. అంటే అక్కడ శాంతి ఉన్నట్లే కదా” అని షా పేర్కొన్నారు.

అంతకుముందు అమిత్‌ షా మాట్లాడుతూ.. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-A రద్దు చేస్తామని ఎవరూ విశ్వసించలేదని పేర్కొన్నారు. బీజేపీ ఆర్టికల్ 370 ను తొలగిస్తామని హామీని ఇచ్చిందని.. దాని ప్రకారం రద్దు చేసిందంటూ పేర్కొన్నారు. ఆగస్టు 5, 2019న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగం నుంచి ఆర్టికల్ 370ని రద్దు చేసినందుకు తాను సంతోషించాని పేర్కొన్నారు. కాశ్మీర్ ఇప్పుడు ప్రశాంతంగా ఉందని.. పెట్టుబడులు జరుగుతున్నాయి.. పర్యాటకులు సందర్శిస్తున్నారని షా తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని ప్రజలు క్రమంగా దేశ తరుపున ఐక్యంగా నిలబడాలని చూస్తున్నారరన్నారు. ఆర్టికల్ 370 రాజ్యాంగంలోని తాత్కాలిక నిబంధన, పూర్వపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చింది. అయితే ఆర్టికల్ 35-A భారతదేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు పూర్వ రాష్ట్రంలో ఆస్తులు కొనుగోలు చేయడాన్ని నిషేధించింది. ఈ రెండు నిబంధనలను ప్రధాని మోదీ ఆగస్టు 5, 2019న రద్దు ఏస్తున్నట్లు ప్రకటించారు.

జమ్మూ కాశ్మీర్‌లో చాలా కాలం పాటు కర్ఫ్యూ విధించారని, జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను బ్లాక్ చేశారని తనకు, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారని షా గుర్తుచేశారు. తాను అక్కడికి వెళ్లినప్పుడు.. కర్ఫ్యూ ఎత్తివేస్తే ఎవరు ప్రాణాలు కోల్పోతారు అని యువకులను ప్రశ్నించానని.. కర్ఫ్యూ విధించి ఎవరిని రక్షించారని అడిగానని.. అప్పుడు వారి నుంచి సమాధానం రాలేదని నిశ్శబ్దంగా కూర్చున్నారని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎన్నికలు నిర్వహించాలన్న జమ్మూ కాశ్మీర్‌ రాజకీయ పార్టీల డిమాండ్‌పై, డీలిమిటేషన్ కసరత్తు తర్వాత ఎన్నికలు జరుగుతాయని పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించిందని షా గుర్తుచేశారు.

మొదట డీలిమిటేషన్ జరుగుతుంది, తరువాత ఎన్నికలు నిర్వహిస్తారని.. ఆ తర్వాత రాష్ట్ర హోదాను క్రమంగా పునరుద్ధరించే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ విషయాన్ని తాను చాలాసార్లు చెప్పానని షా స్పష్టంచేశారు. కానీ వారు రాజకీయ వివాదం సృష్టించాలనుకుంటున్నారంటూ కాశ్మీర్‌ నేతలను విమర్శించారు. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, శాంతిభద్రతల పరిస్థితి మెరుగుదల, పర్యాటకుల రాక, సామాజిక రంగ పథకాల్లో కేంద్రపాలిత ప్రాంతాన్ని మెరుగుపరచడం వంటివి చాలా విషయాలు కాశ్మీర్‌ అభివృద్ధి మార్పును చూపిస్తున్నాయని అమిత్‌ షా అన్నారు. కాశ్మీర్ ప్రజలు ఈ మార్పును స్వాగతిస్తారని ఆశిస్తున్నా అని షా అన్నారు. రాజకీయ, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం కావాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

2014లో కేంద్రంలో దశాబ్దాల సంకీర్ణ రాజకీయాల తర్వాత భారతదేశం సుస్థిరతను సంతరించుకోవడం అదృష్టమని హోంమంత్రి షా అన్నారు. చాలా కాలంగా సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయని.. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేదని అప్పుడు.. ప్రపంచంలో దేశ ప్రతిష్ట దిగజారిందని షా పేర్కొన్నారు. ఆ సమయంలో భారత ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీస్త్ర ప్రభుత్వాన్ని స్పష్టమైన మెజారిటీతో ఎన్నుకున్నారని.. అమిత్‌ షా అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సంస్కరణలు మార్పును సూచిస్తున్నాయంటూ షా పేర్కొన్నారు.

Also Read:

Cyclone Jawad Update: బలహీనపడుతున్న ‘జొవాద్’ తుఫాన్.. దిశ మార్చుకుని ఒడిశా వైపు పయనం

Viral Video: కారును ఢీకొట్టాడని.. ఎస్‌ఐనే కొట్టారు.. ఆ తర్వాత ఏమైందంటే.. వీడియో వైరల్‌