Viral Video: కారును ఢీకొట్టాడని.. ఎస్‌ఐనే కొట్టారు.. ఆ తర్వాత ఏమైందంటే.. వీడియో వైరల్
Man slaps UP police officer: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం చోటు చేసుకుంది. పార్కింగ్‌లో ఉన్న వాహనాన్ని ఢికొట్టాడని.. పోలీసుపై కొందరు దాడి చేశారు. పోలీసు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ..
Man slaps UP police officer: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం చోటు చేసుకుంది. పార్కింగ్‌లో ఉన్న వాహనాన్ని ఢికొట్టాడని.. పోలీసుపై కొందరు దాడి చేశారు. పోలీసు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఓ వ్యక్తి అతని చెంపపై కొట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో శుక్రవారం వైరల్ అయింది. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని ఆశిష్ శుక్లా, ప్రంజూల్ మాథుర్, ప్రియాంక్ మాథుర్, ప్రవేంద్ర కుమార్‌లుగా గుర్తించారు. యూనిఫాంలో ఉన్నది సబ్-ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ పోలీసు అధికారి వినోద్ కుమార్‌గా గుర్తించారు. అయితే.. నిందితుల్లో ఒకరైన ఆశిష్ శుక్లా.. రెండుసార్లు వినోద్‌ను చెంపదెబ్బ కొట్టాడు.
దీనిపై నార్త్ జోన్ అదనపు డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ ప్రాచీ సింగ్ మాట్లాడుతూ.. పిలిభిత్ కొత్వాలిలో పనిచేస్తున్న వినోద్ మైనారిటీ కమీషన్ కార్యాలయం దగ్గరి నుంచి కార్‌లో తిరిగి వెళ్తున్నాడని తెలిపారు. ఈక్రమంలో నిరాలానగర్ వద్దకు రాగానే ఒక బైకర్ అకస్మాత్తుగా ఎదురు రావడంతో అతనిని రక్షించే క్రమంలో.. రోడ్డు పక్కన కాపిన కారును ఢీకొన్నాడని తెలిపారు. అయితే.. హోటల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు తమకారును ఢీకొడతావా అంటూ అతన్ని కొట్టి.. విలువైన వస్తువులను కూడా దోచుకున్నారని తెలిపారు.
వైరల్ వీడియో..
#Lucknow : A man was arrested hours after a video showing him thrashing a policeman went viral on social media on Friday. pic.twitter.com/mi3miAz4UQ
— TOI Lucknow News (@TOILucknow) December 3, 2021
డ్యూటీలో ఉన్న ప్రభుత్వోద్యోగిపై దౌర్జన్యం, క్రిమినల్ చర్యలు వంటి అభియోగాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పోలీసుపైనే చేయి చేసుకుంటున్నారంటూ పలువురు విమర్శిస్తున్నారు.
Also Read: