AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayawada: డబ్బు కోసం చైల్డ్‌ పోర్న్‌ వీడియోల బిజినెస్ మొదలు పెట్టాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.. యువ ఇంజినీర్‌ అరెస్ట్‌

Vijayawada Crime: అతనొక యువ ఇంజినీర్.. మంచి పేరున్న కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కొన్ని ప్రముఖ కంపెనీలలో కూడా పని చేసి మానేశాడు. కానీ ఎంతో భవిష్యత్ ఉన్న ఆ యువకుడు

Vijayawada: డబ్బు కోసం చైల్డ్‌ పోర్న్‌ వీడియోల బిజినెస్ మొదలు పెట్టాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.. యువ ఇంజినీర్‌ అరెస్ట్‌
Arrest
Shaik Madar Saheb
|

Updated on: Dec 04, 2021 | 5:10 PM

Share

Vijayawada Crime: అతనొక యువ ఇంజినీర్.. మంచి పేరున్న కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కొన్ని ప్రముఖ కంపెనీలలో కూడా పని చేసి మానేశాడు. కానీ ఎంతో భవిష్యత్ ఉన్న ఆ యువకుడు నీచపు చర్యలకు దిగాడు. చైల్డ్ పోర్న్ వీడియోలను కొనుగోలు చేసే సమాజం తల దించుకునే వ్యాపారం మొదలు పెట్టాడు. దేశ వ్యాప్తంగా ఆన్లైన్ మారుమూల గ్రామాలకు కూడా విస్తరించింది. ఇప్పుడు వస్తువులు కొనాలన్న అమ్మాలన్నా ఆన్లైన్‌ను వినియోగిస్తున్నారు. అంతే కాకుండా చిన్నారులు సైతం కోవిడ్ సమయంలో క్లాస్‌ల కోసం ఆన్లైన్‌ను వినియోగిస్తున్నారు. ఆన్లైన్ సహాయంతో యువత అనేక విషయాలను తెలుసుకుని నూతన ఆవిష్కరణలు రూపొందించి చరిత్రలో నిలుస్తున్నారు. కానీ కొంత మంది యువత నెట్‌ను దుర్వినియోగం చేసి తమ జీవితాలు చింద్రం చేసుకుంటున్నారు. విజయవాడ ఫకీరు గూడెనికి చెందిన ఇరవై నాలుగు సంవత్సరాల సోహైల్ ప్రముఖ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. పెద్ద కంపెనీలలో పని చేసి ఆశించిన జీతం రాకపోవడంతో ఉద్యోగం వదిలేసాడు. అనంతరం ఇంటి వద్దే ఉంటూ రోజు మొత్తం పోర్న్ సైట్స్ చూస్తూ ఆన్లైన్ లోనే గడిపేవాడు. అయితే ఒక రోజు చైల్డ్ పోర్న్ వీడియోస్ అమ్మబడును అనే ప్రకటన చూసిన సొహైల్ కొంత డబ్బును ఆన్లైన్ లో చెల్లించాడు. కొంత సేపటికే సోహైల్ కు ఒక లింక్ వచ్చింది. లింక్ ను క్లిక్ చేస్తే అందులో నాలుగు వేల చైల్డ్ పోర్న్ వీడియోలు ఉన్నాయి.

దీంతో సులువుగా డబ్భులు సంపాదించాలని నిర్ణయించుకున్న సోహైల్ ఆ వీడియలు అమ్మకానికి పెట్టాడు. తక్కువ ధరకు చైల్డ్ పోర్న్ వీడియోలు అమ్మబడును అనే యాడ్‌ ను ఆన్లైన్ లో పెట్టాడు. ఇది గమనించిన చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సెక్షన్ 62బి ఐ టి యాక్ట్, పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు సోహైల్‌ను అరెస్ట్ చేసి కోర్ట్‌లో హాజరు పరిచారు. కోర్ట్ సోహైల్‌కు రిమాండ్ విధించింది. అయితే సోహైల్ చిన్న పిల్లల నీలి చిత్రాలను ఎవరి వద్ద కొనుగోలు చేశాడు, ఎవరెవరికి అమ్మాడు అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోర్ట్ ఆదేశాలతో చైల్డ్ పోర్న్ సైట్ లను బ్యాన్ చేసినా ఆగంతకులు లింకుల ద్వారా వీడియోలను చూడడం, షేర్ చేయడం, చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు.

చిన్నపిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, లైంగిక నేరాలను అదుపు చేసేందుకు చైల్డ్ పోర్న్‌పై నేషనల్ సైబర్ క్రైం ప్రత్యేక నిఘా పెట్టి సిబ్బందిని సైతం ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. చిన్న పిల్లల నీలి చిత్రాలు సెర్చ్ చేసినా, చూసినా, ఇతరులకు షేర్ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ సైబర్ క్రైమ్ పొలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. చైల్డ్ పోర్న్ నేరాలకు పాల్పడిన వారికి చట్ట ప్రకారం ఐదు నుంచి ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Also Read:

US-Indian Arrest: యూఎస్ వర్జిన్ ఐలాండ్స్‌లో ముగ్గురు భారతీయుల అరెస్ట్.. ఎందుకోసమంటే..?

Mali terror attack: మరోసారి నెత్తురోడిన పశ్చిమాఫ్రికా.. బస్సుపై ఉగ్రవాదుల భీకర కాల్పులు.. 32 మంది సజీవదహనం!