Cyclone Jawad Update: తప్పిన పెనుముప్పు.. బలహీనపడుతున్న ‘జొవాద్’ తుఫాన్.. దిశ మార్చుకుని పయనం

Jawad Cyclone AP Update: జొవాద్‌ తుఫాన్ గండం ముంచుకొస్తోంది. ఈ తుఫాన్‌ ఎఫెక్ట్‌ ఒడిశా సహా ఏపీ, తీరప్రాంతాల్లో భారీగా ఉండనుందని వాతావరణశాఖ తెలిపింది. అయితే.. శనివారం సాయంత్రానికి

Cyclone Jawad Update: తప్పిన పెనుముప్పు.. బలహీనపడుతున్న 'జొవాద్' తుఫాన్.. దిశ మార్చుకుని పయనం
Cyclone Jawad Update
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 04, 2021 | 9:23 PM

Jawad Cyclone AP Update: జొవాద్‌ తుఫాన్ గండం ముంచుకొస్తోంది. ఈ తుఫాన్‌ ఎఫెక్ట్‌ ఒడిశా సహా ఏపీ, తీరప్రాంతాల్లో భారీగా ఉండనుందని వాతావరణశాఖ తెలిపింది. అయితే.. శనివారం సాయంత్రానికి జొవాద్ తుఫాన్ బలహినపడి దిశ మార్చుకొని పయనమవుతున్నట్లు అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కదులుతున్న తుఫాన్ బలహిన పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆరు గంటల్లో మూడు కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా పయనమవుతోందని పేర్కొంది. ప్రస్తుతం జోవాద్ తుఫాన్ విశాఖకు ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, గోపాల్ పూర్ కు 310, పారాదీప్‌కు 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది. ఈరోజు రాత్రికి తుఫాన్‌ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. రేపు మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీకి సమీపంలో వాయుగుండంగా మరింత బలహీన పడే సూచనలు కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఒడిశాలోనూ చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీని ప్రభావంతో తీరం వెంబడి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అయితే.. తుఫాన్‌ క్రమంగా బలహీనపడుతున్న నేపథ్యంలో గాలుల వేగం కూడా తగ్గుముఖం పట్టే అవకాశముందని పేర్కొంది. క్రమంగా పశ్చిమ బెంగాల్ తీరం వద్ద మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ స్పష్టం చేసింది.

అయితే.. ఏపీలో తుఫాన్‌ను ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఒడిశా వైపు తుఫాన్ వెళ్లినా రేపు సాయంత్రం వరకు అధికారులు పూర్తి స్థాయిలో అలెర్ట్‌గా ఉంటారని తెలిపారు. ఏపీలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచనలు చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. తుఫాన్ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఫైర్ డిపార్ట్‌మెంట్ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. సహాయక చర్యల సామగ్రితో సిద్ధంగా ఉన్నారు. దీంతోపాటు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు.

Also Read:

Shilpa Chowdary Cheating Case: కిలాడీ లేడీ శిల్పా చౌదరి కేసులో కొత్త ట్విస్ట్.. తెరమీదకు మరో పేరు..

Murdered Case: దడ పుట్టిస్తున్న గొంతులు కోసే నరహంతక ముఠా.. పోలీసులకు సవాల్‌గా మారిన జంట హత్య కేసు

వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు
వచ్చే విద్యా సంవత్సరం 10th పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి భారత్ ఔట్..
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ